సెల్ ఫోన్ కోసం కన్న కూతురునే తాకట్టు పెట్టిన తండ్రి

Advertisement

ప్రస్తుత రోజుల్లో సెల్ ఫోన్ వాడకాలు జోరుగా ఉన్నాయి. చిన్న వయస్సు నుండి ముసలి వయస్సులో ఉన్న వారి దాక సెల్ ఫోన్ ను విపరీతంగా వాడుతున్నారు. ఇది ఇలా ఉంటె సెల్ ఫోన్ కోసం కన్న కూతురినే అమ్మేశాడు ఓ కసాయి తండ్రి. వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. వ్య‌వ‌సాయ‌ కూలీగా పనిచేస్తున్న ఓ వ్యక్తి జ‌ల్సాలకు అలవాటు పడి తన మూడు నెల‌ల బిడ్డ‌ను లక్ష రూపాయలకు అమ్మేశాడు. ఇక ఆ డబ్బుతో 15వేల రూపాయలు పెట్టి సెల్ ఫోన్, అలాగే 50 వేల రూపాయలు పెట్టి బైక్‌ కొనుగోలు చేసాడు.

అయితే ఈ వ‌స్తువులు కొన‌డానికి అత‌నికి ఇంత డ‌బ్బు ఎక్క‌డ నుంచి వ‌చ్చింద‌ని గ్రామ‌స్థుల‌కు అనుమానం వ్యక్తం అయ్యింది. ఇక ఆ స‌మ‌యంలోనే చిన్న ప‌సిపాప కూడా కనిపించలేదు. దీనితో ఈ విష‌యాన్ని స్థానికులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.ఇక పోలీసులు ఆ దుర్మార్గపు తండ్రిని అదుపులోకి తీసుకోని విచారించగా.. అసలు నిజం బయట పడింది. తన భార్యను కూడా ప్రశ్నించగా.. నన్ను బెదిరించి బిడ్డను తీసుకెళ్లాడని ఆమె ఆరోపించింది. ఒకవైపు భార్యాభర్తలు కలిసే ఈ ఘాతకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here