ఐపీఎల్ : రాహుల్ దెబ్బ.. ఆర్సీబీ అబ్బ

ఐపీఎల్ 2020 యూఏఈ వేదికగా కొనసాగుతుంది. అయితే నిన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టు ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. పంజాబ్ జట్టు కెప్టెన్ కెఎల్ రాహుల్ బ్యాటింగ్ తో బెంగుళూరు జట్టుకు ముచ్చేమటలు పట్టించాడు.

రాహుల్ 69 బంతుల్లో 132 పరుగులు సాధించాడు. దాంట్లో 14ఫోర్లు, 7సిక్సులు బాదాడు. ఇక అనంతరం లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెంగుళూరు జట్టు 17 ఓవర్లకె 109 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యింది. బెంగుళూరు జట్టులో వాషింగ్ టన్ సుందర్ 27 బంతుల్లో 30 పరుగులు తీసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. పంజాబ్ జట్టు 97 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి, ఈ సీజన్ లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.