Kuldeep Yadav : కుల్దీప్ మెడ పట్టుకున్న సిరాజ్.. డ్రెస్సింగ్ రూంలో ఆ ప్రవర్తన ఏంటి అని నెటిజన్స్ ఫైర్
Samsthi 2210 - February 7, 2021 / 03:15 PM IST

Kuldeep Yadav : చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం భారత్ టీంలో నదీమ్, ఇషాంత్ శర్మ టీంలో చేరారు. ఆస్ట్రేలియాలో అదరగొట్టిన సిరాజ్‌కు ఈ మ్యాచ్‌ల ఆడే ఛాన్స్ రాకపోగా, సీనియర్ స్పిన్నర్ కుల్దీప్‌ను పక్కన పెట్టి నదీమ్‌ని ఎంపిక చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే ఈ ఇద్దరు క్రికెటర్స్ డ్రెస్సింగ్ రూమ్ దగ్గర గొడవపడుతున్నట్టుగా కనిపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఏం జరుగుతుంది వీరిద్దరి మధ్య, బీసీసీఐ దీనిపై ఏమైన యాక్షన్ తీసుకుంటుందా అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
వివరాలలోకి వెళితే తొలి టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ టీమ్ బ్యాటింగ్ ఎంచుకుంది. జో రూట్, స్ట్రోక్స్, భారత బౌలర్లని సమర్థంగా ఎదుర్కొని నాలుగో వికెట్‌కి అజేయంగా 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే సెషన్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూంకు వస్తున్న భారత క్రికెటర్స్‌ని డోర్స్ దగ్గర నిలుచొని అభినందిస్తున్న సిరాజ్ సడెన్‌గా కుల్దీప్ యాదవ్ మెడ పట్టుకొని సీరియస్‌గా కనిపించాడు. అక్కడే చీఫ్ కోచ్ రవిశాస్త్రి కూడా ఉండటం గమనార్హం. అయితే ఇదేదో వారిద్దరి మధ్య సరదాగా జరిగినట్టు కనిపించడం లేదు.
డ్రింక్స్ బాయ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సిరాజ్, కుల్దీప్‌లు గొడవ పడడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. సీనియర్ అయిన కుల్దీప్‌ను సిరాజ్ మెడ పట్టుకోవడం ఎంత వరకు కరెక్ట్. ఒక్క మ్యాచ్‌తోనే అతని పొగరు నెత్తికెక్కిందా అంటూ నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా, తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 578 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ 59 పరుగులకు రెండు వికెట్లు కోల్పొయింది. ఓపెనర్స్ ఇద్దరు తక్కువ స్కోరుకే ఆలౌట్ కావడంతో భారత్ కష్టాలలో పడింది. ప్రస్తుతం క్రీజులో విరాట్, పుజారా ఉన్నారు.