ktr : మళ్లీ ఏం అయ్యింది? కేటీఆర్‌ పట్టాభిషేకంకు ఇంకా సమయం ఎందుకు అంటున్న కారు డ్రైవర్లు

when will ktr take charge as telangana cm
when will ktr take charge as telangana cm
ktr : గత నెలలో తెలంగాణ సీఎంగా కేటీఆర్‌ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా కొందరు హడావుడి చేశారు. చిన్నా చితకా లీడర్లు ఆ విషయాన్ని ప్రచారం చేస్తే జనాలు పెద్దగా పట్టించుకునే వారు కాదు. కాని అరడజను మంది మంత్రులు స్వయంగా కేటీఆర్ సీఎం అవ్వబోతున్నాడు అంటూ పదే పదే చెప్పారు. దాంతో ఈ నెలలో కేటీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. కేటీఆర్ ప్రమాణ స్వీకారం కోసం అన్ని ఏర్పాట్లు జరిగాయని కేంద్రంలో కేసీఆర్‌ కీలక పాత్ర పోషిస్తాడు అంటూ కూడా ప్రచారం జరిగింది. వచ్చే ఎన్నికల వరకు కేటీఆర్‌ ను వెయిట్‌ చేయించక పోవచ్చు అనుకున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సమ్మర్ వరకు కేటీఆర్ ను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉందని అంతా భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మళ్లీ కాస్త టైమ్‌ వెయిట్‌ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

కేసీఆర్‌ మరియు కేటీఆర్‌ ఆలోచన ఏంటీ అనేది టీఆర్ఎస్ నాయకులకు తెలియడం లేదు. వారు ఏం చేయబోతున్నారు అనేది ఏ ఒక్కరికి సమాచారం లేదు. ఆ విషయంలో ఇంకా కేసీఆర్ కనీసం చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. ఇక రోజు జనాల్లో ఉండే కేటీఆర్ కూడా ఎప్పుడు సీఎంగా పట్టాభిషేం చేయించుకోబోతున్నాడు అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి కేటీఆర్ ఎందుకు విషయంలో కేసీఆర్‌ ఒక క్లారిటీ నిర్ణయానికి రాలేక పోతున్నాడు అనే విషయంలో మాత్రం స్పష్టత రావడం లేదు.

పార్టీ నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నా కూడా ఎందుకు కేసీఆర్ ముందడుగు వేసి కేటీఆర్ ను సీఎంగా చేయడం లేదు అంటూ టీఆర్ ఎస్‌ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో కాస్త కన్ఫ్యూజ్‌ మరియు టెన్షన్‌ వాతావరణంను జనాల్లో ఆ పార్టీ నాయకులు క్రియేట్‌ చేసి ఆ తర్వాత తాపీగా కేటీఆర్‌ ను సీఎంగా చేయాలనేది కేసీఆర్‌ వ్యూహమా అంటూ రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో అధికార బదిలి ఎంత వరకు కరెక్ట్‌ అనేది కూడా కాస్త ఆలోచించాల్సిన విషయం అంటూ రాజకీయ నాయకులు మరియు కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.
Advertisement