KTR : Hdfc Bankకి మంత్రి కేటీఆర్ థ్యాంక్స్

KTR: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ, బాధితులను ఆదుకోవటంలో తెలంగాణ రాష్ట్ర సర్కారుకు Hdfc బ్యాంకు తన వంతు ఆర్థిక సాయం చేసింది. కోటీ 55 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళంగా అందించింది. ఈ మేరకు బ్యాంకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విశాల్ భాటియా, తెలంగాణ స్టేట్ హెడ్ శ్రావణ్ కుమార్ ఇవాళ మంగళవారం రాష్ట్ర మంత్రి కేటీఆర్ ని కలిసి చెక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బ్యాంకు ప్రతినిధులకు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలియజేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్)లో భాగంగా Hdfc బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు సైతం మెచ్చుకుంటున్నారు.

KTR

రాష్ట్ర సర్కారు.. ‘సూపర్’ నిర్ణయం..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కంట్రోల్ కోసం కేసీఆర్ గవర్నమెంట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పని ప్రదేశాల్లో ఉండేవారిని సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించి వాళ్లు 18-44 ఏళ్ల మధ్య వయసువారు అయినప్పటికీ వ్యాక్సిన్ వేయాలని డిసైడ్ అయింది. ఈ విషయంలో ప్రైవేట్ సంస్థలకి అనుమతిస్తూ జీవోని జారీ చేసింది. ఆ కంపెనీలు తమ ఉద్యోగులకు టీకాలు వేయించేందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ తో  సమన్వయం, ఒప్పందాలు చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించింది. సూపర్ స్ప్రెడర్లకు మరో మూడు రోజుల్లో (ఈ నెల 28 నుంచి) వ్యాక్సినేషన్ ని ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

KTR

ఎంత మంది ఉంటారు?..

తెలంగాణ రాష్ట్రంలో సూపర్ స్ప్రెడర్ల సంఖ్య దాదాపు 30 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కిరాణా, మెడికల్ తదితర షాపుల్లో పనిచేసేవారు, సెలూన్లు నిర్వహించేవారు, ఆటోలు, క్యాబ్ లు నడిపేవారు ఈ పరిధిలోకి వస్తారని సర్కారు స్పష్టం చేసింది. ఇదిలాఉండగా తెలంగాణలో గడచిన 24 గంటల్లో 3,821 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 81,203 మందికి టెస్టులు చేసినట్లు తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో 537 మంది ఈ మహమ్మారి బారిన పడినట్లు బులెటన్ లో పేర్కొంది.