KTR : ఆ మూడు ఎంపీ సీట్లపై కేటీఆర్ ప్రత్యేక ప్లాన్.. తన సత్తా నిరూపించుకుంటాడా..?

NQ Staff - January 28, 2024 / 10:00 AM IST

KTR : ఆ మూడు ఎంపీ సీట్లపై కేటీఆర్ ప్రత్యేక ప్లాన్.. తన సత్తా నిరూపించుకుంటాడా..?

KTR :

కేటీఆర్ ఎలాంటి రాజకీయ నేత అనేది అందరికీ తెలిసిందే. తాను చేయాలనుకున్న దాన్ని ముందే ప్లాన్ వేసుకుని కొట్టడం ఆయనకు అలవాటు. తనకు అప్పగించిన పనిని వంద శాతం పూర్తి చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు కేటీఆర్. అందుకే కేసీఆర్ కూడా కేటీఆర్ ను ఎక్కువగా నమ్ముతారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేటీఆర్ పని చేసిన చోట బీఆర్ఎస్ విజయం సాధించింది. అందులో ముఖ్యంగా హైదరాబాద్ ఉందని చెప్పాల్సిందే. ఎందుకంటే ఇక్కడ బీఆర్ ఎస్ గెలవడానికి ముఖ్య కారణం మాత్రం కేటీఆర్ అనే చెప్పుకోవాలి.

కేటీఆర్ మున్సిపల్, ఐటీ మినిస్టర్ గా ఉండి చేసిన పనే హైదరాబాద్ ను బాగా డెవలప్ చేసిందనే టాక్ ఉంది. ఆయన హయాంలోనే ఎక్కువ పరిశ్రమలు హైదరాబాద్ కు వచ్చాయి. అంతే కాకుండా మున్సిపల్ మంత్రిగా ఆయన చేసిన పనులే హైదరాబాద్ ను బాగా డెవలప్ మెట్ చేశాయి. అందుకే హైదరాబాద్ లో బీఆర్ ఎస్ కు అత్యధికంగా సీట్లు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ అసెంబ్లీలో సత్తా చాటిన చోట మరోసారి ఎంపీ ఎన్నికల్లో తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే గెలిచి ఎంపీ ఎన్నికల్లో గెలవక పోతే తన పరువు ఉండదని కేటీఆర్ కు తెలుసు.

ఎంపీ ఎన్నికల్లో కూడా ఆ మూడు చోట్ల గెలిస్తే తన సత్తా నిరూపించుకున్న వాడిని అవుతానని కేటీఆర్ భావిస్తున్నారు. ఇంతకీ ఆ మూడు ఎంపీ సీట్లు ఏవో కాదండోయ్.. ఒకటి సికింద్రాబాద్, రెండోది మల్కాజిగిరి, మూడోది కరీంనగర్. హైదరాబాద్ లో కేటీఆర్ పని తనం ఉంది కాబట్టి అక్కడ ఆ రెండు ఎంపీ సీట్లు గెలిస్తే అవి తన వల్లే గెలిచినట్టు రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే సీట్లు దాదాపు కేటీఆర్ వల్లే బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇప్పుడు గెలవకపోతే అది మోడీ వేవ్, లేదా కాంగ్రెస్ వేవ్ అని ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఆ ఛాన్స్ ప్రతిపక్షాలకు ఇవ్వొద్దని కేటీఆర్ భావిస్తున్నారు.

ఇక తన సొంత నియోజకవర్గం అయిన సిరిసిల్ల ఉన్న కరీంనగర్ లో ఇంతకు ముందు బండి సంజయ్ గెలిచారు. అది ఆయనకు అస్సలు మింగుడు పడటం లేదు. అందుకే ఈ సారి కరీంనగర్ లో తన పట్టు బిగించాలని కేటీఆర్ భావిస్తున్నారు. అయితే ఈ మూడు చోట్ల కూడా ఇప్పుడు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు లేరు. సికింద్రాబాద్, కరీంనగర్ లో బీజేపీ ఎంపీలు ఉన్నారు.

అటు మల్కాజిగిరిలో మాత్రం కాంగ్రెస్ నుంచి రేవంత్ మొన్నటి వరకు ఉన్నారు. కాబట్టి ఈ మూడు సీట్లు గెలిచి ఉద్దండులకు చెక్ పెట్టినట్టు అవుతుంది. అంతే కాకుండా తన పట్టు ఏంటో నిరూపించుకున్నట్టు అవుతుందని కేటీఆర్ భావిస్తున్నారు. అందుకే ఈ మూడు నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మరి కేటీఆర్ ఎలా తనను తాను నిరూపించుకుంటారో ఎదురు చూడాలి.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us