కేంద్రమంత్రిని కలిసిన మంత్రి కేటీఆర్

Advertisement

ఢిల్లీలో కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పూరీని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కలిశారు. తెలంగాణలో విమానయానశాఖ, పట్టణాభివృద్ధి శాఖ అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు కేటీఆర్. ఈ సందర్భంగా కేంద్ర అధికారులకు రాష్ట్ర పనులను త్వరగా పూర్తి చేయాలని కేంద్రమంత్రి ఆదేశాలు ఇచ్చారు. అలాగే నూతన పురపాలక చట్టం అంశాలను కేంద్ర మంత్రికి వివరించామని కేటీఆర్ తెలిపారు. ఒకవైపు కేంద్ర మంత్రి కూడా ఆక్టోబర్ లో మరోసారి పూర్తి నివేదికతో రావాలని సూచించారు.

వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టును ఉడాన్ పథకంలో చేర్చాలని, అలాగే పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి తెలంగాణకు రావాల్సిన 2537.81 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని కేటీఆర్ కోరారు. అలాగే వీటితో పాటు స్వచ్ఛ భారత్, అమృత్‌ పథకం నిధులు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ 784 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరారు. ఇళ్ల నిర్మాణం కోసం ఇవ్వాల్సిన 1184 కోట్ల రూపాయలు విడుదల చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here