KTR: ఆర్డర్ చేసిన చికెన్ రాలేదంటూ కేటీఆర్‌కు ట్వీట్‌.. షాకైన మంత్రి

తెలంగాణ ఐటీ శాఖా మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు ట్విట్టర్‌లో చాలా యాక్టివ్ అన్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌స్తుతం విజృంభిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ప‌డుతున్న బాధ‌ల‌ను గుర్తిస్తున్న కేటీఆర్ వెంట‌నే వాటికి శాశ్వ‌త ప‌రిష్కారం వ‌చ్చేలా చూస్తున్నారు. సోష‌ల్ మీడియాలోను ఆయ‌న‌కు అనేక రిక్వెస్ట్‌లు వ‌స్తుండ‌గా, వాటిపై వెంట‌నే స్పందిస్తూ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్నారు కేటీఆర్. అయితే తాజాగా తోట‌కూరి ర‌ఘుప‌తి అనే నెటిజ‌న్ చేసిన రిక్వెస్ట్ ఆయ‌న‌కు పెద్ద షాకిచ్చింది.

వివ‌రాల‌లోకి వెళితే ర‌ఘుప‌తి అనే వ్య‌క్తి .. నేను జొమాటోలో ఎక్స్‌ట్రా మ‌సాలా, లెగ్ పీస్‌తో చికెన్ బిర్యానీ ఆర్డ‌ర్ చేసాను. కాని ఇందులో ఏది రాలేదు. జొమాటో వారి సేవ‌లు ఈ ర‌కంగా ఉంటే ఎలా అంటూ కేటీఆర్‌, జొమాటోను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌కు కేటీఆర్ స్పందించడం విశేషం. ఇలాంటి స‌మ‌స్య‌కు నన్ను ఎందుకు ట్యాగ్ చేశావు బ్ర‌ద‌ర్, నా నుండి ఏ సాయం కోరుకుంటున్నావు అంటూ స‌మాధానమిచ్చాడు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కాగా, నెటిజ‌న్‌పై తిట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. తిండి లేక చాలా మంది అవ‌స్థ‌లు ప‌డుతుంటే నీకు స‌రైన చికెన్ రాలేదుంటూ కేటీఆర్‌కు ట్వీట్ చేస్తావా అంటూ తిట్ల దండ‌కం అందుకున్నారు.