KTR: మొన్న కేసీఆర్, నేడు కేటీఆర్‌.. రోజు రోజుకు పెరుగుతున్న క‌రోనా కేసులు

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌స్తుతం విల‌య తాండవం చేస్తుంది. సామాన్యుల‌తో పాటు సినీ, రాజ‌కీయ‌, క్రీడా ప్ర‌ముఖుల‌ను సైతం వ‌ణికిస్తుంది. రీసెంట్‌గా తెలంగాణ ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు కూడా క‌రోనా బారిన ప‌డ్డారు.కరోనా సంక్రమించడం వల్ల ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ త‌న ఫాం హౌజ్‌లో చికిత్స పొందుతున్న‌ట్టు తెలుస్తుంది. అయితే కేసీఆర్‌కు క‌రోనా అని తెలియ‌డంతో ఆయన సతీమణి శోభతో పాటు, ఎమ్మెల్సీ కవిత కూడా ఫాంహౌజ్‌లోనే క్వారంటైన్‌లో ఉన్నారు.

తాజాగా తెలంగాణ మంత్రి, కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్‌కు కూడా క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుండి మాస్క్‌తోనే క‌నిపించిన కేటీఆర్ ఇప్పుడు క‌రోనా బారిన ప‌డ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. త‌న‌కు క‌రోనా సోకిన విష‌యాన్ని కేటీఆర్ స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. నాకు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. కొద్ది పాటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నాను. గ‌త కొద్ది రోజులుగా న‌న్ను క‌లిసిన వాళ్లు కోవిడ్ ప్రోటో కాల్స్ పాటిస్తూ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోండి, జాగ్ర‌త్త‌గా ఉండండి అని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement