వరదలో కొట్టుకుపోయిన కేటీఆర్ అనుచరుడు
Admin - August 17, 2020 / 11:30 AM IST

తెలంగాణాలో వర్షాలు ఎడతెరిపిలేకుండా పడుతున్నాయి. ఈ వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి కి చెందిన కేటీఆర్ అనుచరుడు తెరాస నేత జంగపల్లి శ్రీనివాస్ వరద నీటిలో గల్లంతయ్యారు. అయితే సిద్దిపేట జిల్లా శనిగరం టూ బద్దిపల్లి రోడ్డులోని మద్దికుంట వాగులో శ్రీనివాస్ నడుపుతున్న కారు కొట్టుకుపోయింది. నిన్న రాత్రి శ్రీనివాస్ తో సహా తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో మంథనికి బయలుదేరి వెళ్తున్నారు. అయితే ఈ క్రమంలో మద్దికుంట వాగు తీవ్రంగా ప్రవహిస్తుంది. ఇక ఆ వాగును గమనించని శ్రీనివాస్ కారులో అలాగే ముందుకు సాగారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండడంతో కారు ఆ నీటిలో గల్లంతయ్యింది.
దగ్గరలో ఉన్న స్థానికులు ఆ కారును గమనించి దాంట్లో ఉన్న ముగ్గురిని రక్షించారు. కానీ కారుతో పాటు శ్రీనివాస్ వరద ఉధృతికి కొట్టుకుపోయారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ స్పందించారు. వెంటనే సిద్ధిపేట జిల్లా కలక్టర్తో ఫోన్లో మాట్లాడారు. అలాగే గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో సిద్ధిపేట జిల్లా ఆర్డీవో మద్దికుంట వాగు దగ్గరికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.