KTR : రేవంత్ రెడ్డి వ్యభిచారి… కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
NQ Staff - June 27, 2023 / 08:34 PM IST

KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రముఖ మీడియా సంస్థ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ మరియు బీజేపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. అంతే కాకుండా ఆ రెండు పార్టీల యొక్క రాష్ట్ర అధ్యక్షులను ఓ రేంజ్ లో ఏకి పారేసినట్లుగా మాట్లాడాడు.
రేవంత్ రెడ్డి మీ పై పలు సార్లు ఆరోపణలు చేశారు. వాటిని మీరు నిరూపించుకోలేదు అన్నట్లుగా టీవీ యాంకర్ ప్రశ్నించిన సమయంలో కేటీఆర్ స్పందిస్తూ… రేవంత్ రెడ్డి వ్యభిచారి అని నేను అంటాను. తాను వ్యభిచారి కాదు అంటూ నిరూపించుకోగలడా అంటూ కేటీఆర్ ప్రశ్నించాడు.
నా కొడుకును పంది అంటూ తిట్టాడు. అంతే కాకుండా నా ఫ్యామిలీని వ్యక్తిగతంగా విమర్శించారు. అత్యంత దారుణంగా విమర్శించాడు. మానవీయ విలువలు మరచి మరీ రాజకీయాలను దాటి మరీ విమర్శలు చేస్తున్నారు అంటూ కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిపై తీవ్ర విమర్శలు చేశాడు.