KTR And Bandi Sanjay : ఉగాది పంచాంగం… ట్విట్టర్ లో కేటీఆర్ వర్సెస్ బండి

NQ Staff - March 22, 2023 / 08:08 PM IST

KTR And Bandi Sanjay : ఉగాది పంచాంగం… ట్విట్టర్ లో కేటీఆర్ వర్సెస్ బండి

KTR And Bandi Sanjay  : నేడు ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు కూడా కాస్త విభిన్నంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కి ఎంటర్టైన్మెంట్ ని అందించారు. ఉగాది పండుగను అడ్డం పెట్టుకుని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.

మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ కు సమాధానం అన్నట్లుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్విట్టర్ లో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ట్వీట్ ను చేయడం జరిగింది.

మొదట కేటీఆర్ ట్విట్టర్ లో… ఆదాయం: అదానీకి! వ్యయం: జనానికి, బ్యాంకులకు! అవమానం: నెహ్రూకి! రాజపూజ్యం: గుజరాతీ గుంపుకి!! బస్, బభ్రాజీమానం భజగోవిందం! అంటూ ట్వీట్‌ చేశాడు.

బండ్ల బండి సంజయ్ దాన్ని కొనసాగిస్తూ.. ఆదాయం : కల్వకుంట్ల కుటుంబానికి, వ్యయం : తెలంగాణ రాష్ట్రానికి అవమానం : ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు రాజపూజ్యం : ఉద్యమ ద్రోహులకు, దొంగలకు !! తుస్.., పిట్టల దొర, తుపాకి చంద్రుల గడీల పంచాతీ లెక్క తేలుడే తరువాయి…పతనం ఇగ షురువాయే.

ఉగాది సందర్భంగా ఆదాయం, వ్యయం, అవమానం, రాజ్యపూజం అంటూ పంచాంగంలో చెబుతూ ఉంటారు. ఆ విధంగా కేటీఆర్‌ మరియు బండి సంజయ్ కూడా ట్విట్టర్‌ లో పొలిటికల్‌ సెటైర్స్ వేసుకున్నారు.

 

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us