నూతన రోడ్స్ వేయడానికి కేంద్రం సహకరించడం లేదు : కేటీఆర్

Advertisement

హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దటానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రహదారుల అభివృద్ధికి నాలుగు రకాల ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలో కొత్త రోడ్లు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే కేంద్రం సహకరించడం లేదని అన్నారు.

శాసనసభలో ఆయన మాట్లాడుతూ రక్షణ రంగానికి చెందిన కంటోన్మెంట్‌ స్థాలాలను రాష్ట్రానికి ఇవ్వడం లేదన్నారు. ఏళ్లుగా అడుగుతున్నా వారి ఆలోచన సైతం చెప్పడం లేదని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు స్పందిస్తూ ప్రభుత్వం తన తప్పులను కప్పువేసుకోవడానికి బీజేపీపై నిందలు మోపడం సరికాదని మండిపడ్డారు. బీజేపీ చేస్తున్న కుట్రపూరితమైన పనుల వల్లే రాష్ట్రానికి అందాల్సిన నిధులు సరిగ్గా రావడం లేదని టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here