KS Bhagawan : శ్రీరాముడు సీతతో కలిసి వైన్ తాగేవాడు.. కేఎస్ భగవాన్ వివాదాస్పద వ్యాఖ్యలు..!
NQ Staff - January 21, 2023 / 09:38 AM IST

KS Bhagawan : ఈ నడుమ హిందూ దేవుండ్ల మీద చాలామంది నాస్తికులు, హేతువాదులు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం మనం చూస్తున్నాం. విమర్శకు కూడా ఒక హద్దు ఉంటుందనేది మర్చిపోయి వారు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాలకు దారి తీస్తున్నాయి. మొన్నటికి మొన్న బైరి నరేశ్ ఉదంతం ఎంత దుమారం రేపిందో చూశాం. ఇక ఆ విషయాన్ని మర్చిపోక ముందే ఇప్పుడు మరో ఉదంతం తెరమీదకు వచ్చింది.
ప్రముఖ రచయిత, హేతువాది అయిన కేఎస్ భగవాన్ శ్రీరాముడిపై వివాదాస్పద కామెంట్లు చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. ఆయన ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఇదేం మొదటి సారి కాదు. గతంలో కూడా ఇలాంటి కామెంట్లు చేశాడు ఆయన.
ద్రాక్ష రసం తాగేవాడు..
మొన్న జనవరి 20వ తేదీన కర్ణాటక లోని మాండ్యాలో జరిగిన ఓ కార్యక్రమంలో భగవాన్ ఈ కామెంట్లు చేశాడు. రాముడు ప్రతిరోజూ మధ్యాహ్నం భార్య సీతతో కలిసి వైన్ తాగేవాడు. ఇది ఆయన దినచర్యలో భాగం. మధ్యాహ్న సమయంలో ద్రాక్ష రసం తాగడం ఆయనకు అలవాటు. అలాగే సీతకు కూడా తాగిస్తాడు.
ఈ విషయాన్ని నేను చెప్పట్లేదు. ‘వాల్మీకి రామాయణం’ చెబుతోందంటూ ఆయన మాట్లాడాడు. 2019 లో కూడా ఆయన ఇలానే కామెంట్లు చేశాడు. అప్పుడు కూడా రాముడు మత్తు పదార్థాలు సేవించేవాడని, సీతకు కూడా తాగించేవాడంటూ తెలిపాడు కేఎస్ భగవాన్. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.