Kriti Sanon : వాడు అందరి ముందే నన్ను అవమానించాడు.. కృతిసనన్ ఎమోషనల్..!
NQ Staff - June 12, 2023 / 10:25 AM IST

Kriti Sanon : సినిమా రంగంలో రాణించడం అంటే మాటలు కాదు. ఇప్పుడు మనకు స్టార్లుగా కనిపిస్తున్న వారంతా కూడా ఒకప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కున్న వారే ఉంటారు. కానీ సమయాను సారం వాటిని బయటపెడుతారు. ఇప్పుడు కృతిసనన్ కు సంబంధించిన విషయంలో కూడా ఇలాంటి ఘటనే జరిగిందంట. ఆమెనే స్వయంగా చెప్పుకొచ్చింది.
ఒకప్పుడు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసిన కృతి.. అప్పట్లోనే మహేశ్ బాబు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎక్కువ కాలం తెలుగులో ఉండలేక మళ్లీ బాలీవుడ్ కు వెళ్లిపోయి అక్కడే స్టార్ స్టేటస్ ను సంపాదించుకుంది. ఇక చాలా కాలం తర్వాత ఆమె ఆదిపురుష్ సినిమాతో తెలుగులోకి అడుగు పెడుతోంది.
పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. అయితే మొదటి నుంచి ఈ మూవీపై ఎన్నో వివాదాలు వస్తున్నాయి. రీసెంట్ గానే తిరుమల కొండపై కృతిని డైరెక్టర్ ఓం రౌత్ ముద్దు పెట్టుకోవడం దుమారం రేపింది. ఇదిలా ఉండగా తాజాగా ప్రమోషన్ లో కృతి ఆసక్తికర కామెంట్లు చేసింది.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. నేను కూడా చాలా అవామానాలు భరించాను. నేను మొదట్లో ఢిల్లీ నుంచి ముంబైకి ఓ ర్యాంప్ షో కోసం వెళ్లాను. అయితే ఆ షోలో డ్యాన్స్ మాస్టర్ అందరి ముందే నన్ను అసభ్యకరంగా అవమానించాడు. దాంతో మోడలింగ్ వదిలేద్దామని అనుఉకన్నా.. కానీ మా అమ్మ ఇచ్చిన ధైర్యంతోనే ఇక్కడి దాకా వచ్చాను అంటూ ఎమోషనల్ కామెంట్లు చేసింది కృతి సనన్.