Kriti Sanon : ఓ పక్క ఎఫైర్ రూమర్లు.. మరో పక్క ప్రభాస్ పై మనసులో మాట చెప్పిన కృతిసనన్..!
NQ Staff - June 15, 2023 / 10:11 AM IST

Kriti Sanon : త కొంత కాలంగా కృతిసనన్-ప్రభాస్ గురించి చాలా రకాల వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటారని ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ప్రభాస్ ఇంకా పెళ్లి కాని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఆయన కోసం అమ్మాయిలేంటి.. హీరోయిన్లు కూడా ఎదురు చూస్తుంటారు.
అంతటి అందగాడు ఎవరి సొంతం అవుతాడో అని అంతా వెయిట్ చేస్తున్నారు. అయితే గతంలో కూడా ప్రభాస్ తో చాలామంది హీరోయిన్లకు రూమర్లు అంటగట్టారు. ఇక తాజాగా ప్రభాస్ కు కృతిసనన్ కు మధ్య ప్రేమ రూమర్లు బాగా వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కృతి సనన్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఆమె ఆదిపురుష్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ టాక్ షోలో పాల్గొంది. ఇందులో ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. ప్రభాస్ చాలా తక్కువ మాట్లాడుతారని అనుకుంటారు. కానీ చాలా ఎక్కువగా మాట్లాడుతారు. నేను మామూలుగా మాట్లాడేదాన్ని. కానీ ఆయన చాలా ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటారు.
ఆయన చాలా స్వీట్ పర్సన్. రాముడు పాత్రలో ఆయన్ను తప్ప ఇంకెవరినీ నేను ఊహించుకోలేనున అంటూ సిగ్గు పడుతూ చెప్పింది ఈ భామ. ఇది ఒక రకంగా ప్రభాస్ మీద తనకు ఉన్న క్రష్ ను బయట పెట్టే విధంగా ఉందని చెప్పుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మీ అభిప్రాయం కూడా తెలియజేయండి.