Krithi Shetty : సమంత లాంటి పనులు చేయను.. దారుణంగా అవమానించిన కృతిశెట్టి..!

NQ Staff - May 14, 2023 / 02:30 PM IST

Krithi Shetty : సమంత లాంటి పనులు చేయను.. దారుణంగా అవమానించిన కృతిశెట్టి..!

Krithi Shetty  : టాలీవుడ్ లో నాగచైతన్య-సమంత జంటకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. వీరిద్దరి గురించి ఏ చిన్న వార్త వచ్చినా సరే ఇట్టే ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది. వీరిద్దరూ విడిపోయి ఇప్పటికే ఏడాది దాటిపోతోంది. కానీ ఇంకా వారి విడాకుల వార్తలు మాత్రం ఆగట్లేదు. ఎందుకుం విడిపోయారన్నది ఇప్పటికీ సస్పెన్సే.

ఇక విడిపోయిన తర్వాత ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉంటున్నారు. ఇటు నాగచైతన్య రీసెంట్ గా కస్టడీ సినిమాతో వచ్చారు. కృతిశెట్టి ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే మొదటి నుంచి నాగచైతన్యకు కృతి దగ్గరవుతోందనే రూమర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కృతి చేసిన కామెంట్లు సమంత ఫ్యాన్స్ కు మండేలా చేస్తున్నాయి.

ఆమె కస్టడీ ప్రమోషన్ లో మాట్లాడుతూ.. నేను సమంత లాగా ఐటెం సాంగ్స్ అయితే చేయను. ఆమె పుష్ప సినిమాలు చేసిన ఐటెం సాంగ్ చూశాను. అలాంటి సాంగ్ చేయాలంటే చాలా అవగాహన కావాలి. నాకు అంతటి అవగాహన లేదు. అందుకే నేను ఇప్పట్లో అలాంటి సాంగ్స్ చేయాలని అనుకోవట్లేదు.

నేను చేసిన సినిమాల నుంచి ఒక్కటే నేర్చుకున్నా.. మనకు అవగాహన లేకుండా తప్పుడు పనులు చేయొద్దు అంటూ చెప్పింది కృతిశెట్టి. కాగా ఆమె చేసిన కామెంట్లపై సమంత ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. సమంత ఏమైనా తప్పుడు పని చేసిందా.. ఐటెం సాంగ్ చేస్తే తప్పేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా కృతి చేసిన కామెంట్లు సమంతను అవమానించేలా ఉన్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us