Krishnam Raju: కృష్ణంరాజు స‌న్మానించింది ప‌ని మ‌నిషిని కాద‌ట‌, ఆమె ఎవ‌రో తెలుసా?

Krishnam Raju: రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు ద‌యా హృద‌యానికి మారు పేరు అని అంటారు.ఆయ‌న క‌ష్టం వ‌చ్చిన వారికి త‌ప్ప‌క సాయం చేస్తూ ఉంటారు. తమ ఇంట్లో గత 25ఏళ్లుగా పనిచేస్తున్న పద్మ అనే మహిళను కృష్ణంరాజు కుటుంబం ఘనంగా సన్మానించింది.. 25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటూ కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశారు.

Krishnam Raju

ఇందుకు సంబంధించిన ఫోటోలను కృష్ణంరాజు కుమార్తె ప్రసీద షేర్ చేస్తూ 25 ఏళ్లుగా మాకోసం చాలా చేశారంటూ పోస్ట్ చేయగా అవి వైరల్ మారాయి. అంతేకాకుండా ఆమెకి కృష్ణంరాజు స‌తీమ‌ణి శ్యామ‌లా దేవి ఓ బంగారు గొలుసును కూడా కానుకగా ఇచ్చినట్లు సమాచారం.

సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. పనిమనిషికి ఇలా సత్కారం చేయడం గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.కాక‌పోతే ఆమె ప‌ని మ‌నిషి కాద‌ట‌. 25 సం.లుగా కృష్ణంరాజు ఫ్యామిలీకి మేనేజర్ గా వ్యవహరిస్తున్న పద్మగారికి కృష్ణంరాజు దంపతులు సన్మానం చేశారు.

కృష్ణంరాజుకు సంబంధించిన మీడియా రిలీజస్, ఇంటర్వ్యూ షెడ్యుల్స్ వంటి వ్యవహారాలు నిర్వహించడంలో పద్మ చురుగ్గా ఉంటారు. ఆమె చేసిన సేవలకు కృష్ణంరాజు దంపతులు ఆత్మీయ సత్కారం చేశారు. పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన పద్మ 25 ఏళ్ల క్రితం కృష్ణంరాజు దగ్గర కార్యదర్శిగా చేరారు.

ఒకప్పుడు విల‌న్‌గా,హీరోగా అల‌రించిన కృష్ణం రాజు ఇప్పుడు సినిమాలు కాస్త త‌గ్గించారు. ఆయ‌న ప్ర‌భాస్ రాధే శ్యామ్ చిత్రంలో చివ‌రిగా క‌నిపించిన‌ట్టు తెలుస్తుంది.