Kerala : ఓరినీ.. వీళ్లంతా అబ్బాయిలా.. అమ్మాయిల కంటే అందంగా ఉన్నారే..!
NQ Staff - March 30, 2023 / 03:32 PM IST

Kerala : ఏంటి ఈ వీడియో చూశారా.. అందంగా ఉన్న అమ్మాయిలను చూసి మీ గుండెల్లో గంట కొట్టేసిందా.. కొట్టే ఉంటుంది లెండి. వీళ్లెవర్రా బాబు ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నారు అని మీలో మీరు అనుకుంటున్నారు కదా.. మేం కూడా అలాగే అనుకున్నామండి. కానీ అసలు విషయం తెలిసి మైండ్ బ్లాంక్ అయిపోయింది.
ఇప్పుడు మేం చెప్పేది వింటే మీకు కూడా మైండ్ పనిచేయదేమో. ఎందుకంటే వాళ్లంతా అమ్మాయిలు కాదండోయ్.. అందంగా ముస్తాబైన అబ్బాయిలు. ఏంటి అబ్బాయిలా అని షాక్ అవుతున్నారా అదే నిజమండి బాబు. వాళ్లంతా అమ్మాయిల లాగా రెడీ అయిన అబ్బాయిలు. అసలు విషయం ఏంటంటే..
కేరళలోని కొట్టాయంలోని కొట్టం వనదుర్గ అమ్మవారి ఆలయంలో ఏటా చమ్మయ్య, విలక్కు అనే ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో అమ్మాయిలు దుర్గామాతకు పూజలు చేయరు. అబ్బాయిలే అమ్మాయిల లాగా చీరకట్టుకుని ముస్తాబై పూజలు నిర్వహిస్తారు. అలాగే చమ్మయ్య, విలక్కు అనే దీపాన్ని వెలిగిస్తారు.
ఇంకో విషయం ఏంటంటే అబ్బాయిల ఇంట్లో వారే దగ్గరుండి మరీ ఇలా అమ్మాయిల లాగా రెడీ చేయిస్తారు. ఆలయ ప్రాంగణంలో దీని కోసం సెపరేటుగా గ్రూమింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారండోయ్. ఈ సెంటర్లలో రెడీ అయిన వారంతా ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్తారు.
అయితే ఇలా అమ్మాయిల్లాగా ఉన్న వారిని చూస్తే మన కండ్లు మనల్ని మోసం చేస్తాయి మనం చూస్తుంది అమ్మాయిలనే కావచ్చు అని అనుకుంటాం. కానీ అది నిజం కాదు. అమ్మాయిల లాగా మారి పూజలు చేస్తే మనసులో కోరికలు తీరుతాయని అక్కడి వారి నమ్మకం. కరోనా వచ్చిన తర్వాత రెండేళ్లు పూజలు చేయలేదు.

Kottam Vanadurga Ammavari Temple in Kottayam Kerala mens Sarees And Perform Puja
కానీ ఈ ఏడాది ఘనంగా పూజలు నిర్వహించారు. రెండేళ్ల క్రితం 4వేల మంది పురుషులు భక్తులుగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య కాస్త తగ్గిపోయింది. కానీ పూజల్లో మాత్రం తేడా రాలేదు. అమ్మాయిల కంటే అందంగా ముస్తాబై అందగత్తెలకే అసూయ పుట్టిస్తున్నారు ఈ అబ్బాయిలు.
అన్నట్టు చెప్పడం మర్చిపోయాం.. మన దగ్గర కూడా ఇలాంటి పండుగలు చేస్తారు. కర్నూలు, చిత్తూరు, నెల్లూరులో ఇలా అబ్బాయిలు అమ్మాయిలుగా వేశాలు వేసుకుని పూజలు చేస్తారు. ఎక్కువగా ఉగాది సమయంలో ఇలాంటి పూజలు చేస్తారు అబ్బాయిలు.