Kotam Reddy Sridhar Reddy : అధికార పార్టీకి షాక్.. టీడీపీలోకి కోటంరెడ్డి
NQ Staff - January 31, 2023 / 01:37 PM IST

Kotam Reddy Sridhar Reddy: మొన్నటి వరకు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత కొన్ని రోజులుగా పార్టీ మారబోతున్నారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
ఆయన్ని బుజ్జగించేందుకు పలువురు ముఖ్య నేతలు కూడా ప్రయత్నించారు అనే ప్రచారం జరిగింది. ఆ మధ్య జగన్ తో కూడా భేటీ అయినట్లుగా వార్తలు వచ్చాయి. వైకాపా అధిష్టానం పై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి అసంతృప్తి అంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది.
తన ఫోన్ టాపింగ్ జరుగుతుందని కూడా కోటంరెడ్డి ఒకానొక సమయంలో ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యేందుకు రెడీ అయినట్లుగా ఆయన సన్నిహితుల నుండి సమాచారం అందుతుంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర షురూ చేసిన వెంటనే ఆపరేషన్ వైకాపా మొదలైనట్లు తెలుస్తోంది. వైకాపా నుండి తెలుగు దేశం పార్టీలోకి కోటంరెడ్డి జాయిన్ అవ్వడం కచ్చితంగా టిడిపికి బలం చేకూర్చే అంశం అన్నట్లు రాజకీయ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.