Koratala Shiva : బాల‌కృష్ణ‌-మ‌హేష్ బాబుతో మ‌ల్టీ స్టార‌ర్ ప్లాన్ చేస్తున్న కొరటాల‌

Koratala Shiva : హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు కొరటాల శివ ప్ర‌స్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు, ఇది ఇప్పుడు ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. కొరటాల శివ ఎన్టీఆర్ 30వ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఈ నెలాఖరున ఎన్టీఆర్ లేకుండా మిగతా ఆర్టిస్టులతో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.

TheNewsQube-
Koratala Shiva planing multi starer movie with mahesh babu and balakrishna
Koratala Shiva planing multi starer movie with mahesh babu and balakrishna

ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ, ఎన్టీఆర్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసారు. ఒకసారి రంగంలోకి దిగాకా .. మూడు షెడ్యూల్స్‌లలో ఈ సినిమాను కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు.ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో కథానాయికగా రామ్ చరణ్ భామ ఆలియా భట్‌ను ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

Koratala Shiva planing multi starer movie with mahesh babu and balakrishna
Koratala Shiva planing multi starer movie with mahesh babu and balakrishna

ఈ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు 6 నుంచి 7 కేజీల వరకు బరువు తగ్గే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో తారక్.. స్టూడెంట్ లీడర్‌గా కనిపించే సన్నివేశాలున్నాయి. అందుకోసం కాస్త సన్నబడాలని కొరటాల శివ.. ఎన్టీఆర్‌ను కోరినట్టు సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ముందుగా కియారా అద్వానీ, రష్మిక మందన్న, కీర్తి సురేష్ పేర్లు వినిపించాయి.

Koratala Shiva planing multi starer movie with mahesh babu and balakrishna
Koratala Shiva planing multi starer movie with mahesh babu and balakrishna

ఫైనల్‌గా ఈ చిత్రంలో ఆలియా భట్‌‌ దాదాపు ఖరారైనట్టు సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈ సినిమా కోసం ఆలియాకు భారీగానే పారితోషకం ముట్టజెప్పబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆలియా భట్.. ఆర్ఆర్ఆర్‌ ఎన్టీఆర్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. అందులో రామ్ చరణ్ సరసన నటించింది.ఇపుడు కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా నటించబోతుంది.

తాజాగా కొరటాల శివ మనసులో వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయని వినికిడి. ప్రస్తుతం ఆయన భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు మరియు నందమూరి బాలకృష్ణలతో ఒక మల్టీ స్టారర్‌ను రూపొందించాలని శివ ప్లాన్ చేస్తున్నాడు. సమీప భవిష్యత్తులో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తానన్న నమ్మకంతో ఉన్నాడు.