AACHARYA: వాయిదాల ప‌ర్వం కొన‌సాగిస్తున్న‌‘ఆచార్య’ .. వడ్డీల భారం కొరటాల శివ మోయక తప్పదా?

అదేంటి.. ఓ సినిమా కష్టనష్టాలు, లావాదేవీలు అన్నీ నిర్మాత చేతిలో ఉంటాయి కదా.. దర్శకుడుకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా..? ఇది నిజమే కానీ టాలీవుడ్ లో కొందరు దర్శకులు తమ సినిమాలకు సంబంధించిన మార్కెటింగ్ మొత్తం వాళ్లే చూసుకుంటారు. రాజమౌళి, వినాయక్ లాంటి దర్శకులు ఇందులో ఉన్నారు. కొరటాల శివ కూడా అదే జాబితాలోకి వస్తాడు. తాను తెరకెక్కించే సినిమాలకు సంబంధించిన మార్కెటింగ్, బిజినెస్ విషయాలు ఆయన దగ్గరుండి చూసుకుంటాడు. ఇప్పుడు చిరంజీవితో తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమా విషయంలో కూడా కొరటాల శివ ఇదే చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా కారణంగా ఆగిపోయింది.

Articles on internet on Acharya Release Date
 

మే 13న విడుదల చేయాలని ముందు నుంచే ప్లాన్ చేసినా కూడా చివరి నిమిషంలో వైరస్ వచ్చి అంతా పాడు చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన అదనపు భారం ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివపై పడుతుందని తెలుస్తోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్ని ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఇందులో రామ్ చరణ్, చిరంజీవి పారితోషికం మాత్రమే కొణిదెల కంపెనీ చూసుకుంటుంది. మిగిలిందంతా మరో నిర్మాత నిరంజన్ రెడ్డి చూసుకుంటున్నాడు. ఇక ఈ సినిమా బిజినెస్ కొరటాల శివ దగ్గరుండి చూసుకుంటున్నాడు.

ఇక్కడే అసలు సమస్యలు వస్తున్నాయి. ఈయనకు సపరేట్ డిస్ట్రిబ్యూటర్స్ టీం ఉంది. కొరటాల శివ ప్రతి సినిమా వాళ్లే కొంటుంటారు. అంతేకాదు ఆ సినిమాను ఎంతకు అమ్మాలనే రేట్లు కూడా ఆయనే నిర్ణయిస్తాడు అని ప్రచారం ఉంది. భరత్ అనే నేను సినిమా విడుదల సమయంలో నిర్మాత దానయ్యతో కొరటాలకు ఇలాంటి లావాదేవీల సమస్య వచ్చింది. ఇలాంటి సమయంలో ఆచార్య సినిమాకు కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఈ సినిమా బిజినెస్ కాస్త మార్జిన్ లో చూసుకొని మొత్తం కొరటాలకు నిర్మాత నిరంజన్ అందించాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తనకు లాభం వచ్చేలా డిస్ట్రిబ్యూటర్లతో కొరటాల ఒప్పందం చేసుకున్నాడు. కానీ సినిమా ఆలస్యం అవుతుండడంతో వీటికి సంబంధించిన ఫైనాన్స్ వడ్డీల భారం కొరటాలపై పడుతుందని తెలుస్తోంది. గతంలో వినాయక్ విషయంలో కూడా ఇదే జరిగింది. అఖిల్ సినిమా ఫ్లాప్ అయినప్పుడు తన రెమ్యూనరేషన్ నుంచి కొన్ని డబ్బులు డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చాడు వినాయక్.

Advertisement