Konda Surekha : నారా భువ‌నేశ్వ‌రికి కొండా సురేఖ స‌పోర్ట్.. స్పందించ‌నందుకు క‌విత‌, కేటీఆర్, ష‌ర్మిలపై ఆగ్ర‌హం

Konda Surekha : కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో ఎంత ర‌చ్చ జ‌రిగిందో మ‌నం చూశాం. త‌న భార్య‌ను అన్నందుకు చంద్ర‌బాబు క‌న్నీరు పెట్టుకున్నాడు. తన భార్య వ్యక్తిత్వంపై అసెంబ్లీ వేదికగా దాడి చేశారంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వెక్కివెక్కి ఏడ్చేసిన విషయం తెలిసిందే.గతంలో తన తల్లిని దూషించారు.. ఇప్పుడు తన భార్య విషయం తీసుకువచ్చి అవమానించారంటూ భోరున విలపించారు.

Konda Surekha about nara bhuvaneshwari assembly issue
Konda Surekha about nara bhuvaneshwari assembly issue

గతంలో శాసనసభలో ఆవేశాలు, కోపాలు ఉండేవని, సభ వాయిదా పడేదని, తిరిగి సమావేశమైన తర్వాత ఎవరిది తప్పయితే వారికి స్పీకర్ చెప్పేవారని చంద్రబాబు అన్నారు. కానీ, ఇప్పుడు అసెంబ్లీ కౌరవ సభను తలపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తన తల్లిని దూషించారు.. ఇప్పుడు తన భార్య విషయం తీసుకువచ్చి అవమానించారంటూ భోరున విలపించారు.

Konda Surekha about nara bhuvaneshwari assembly issue
Konda Surekha about nara bhuvaneshwari assembly issue

గత రెండున్నరేళ్లుగా తనను అవమానిస్తూ వస్తున్నారని, ప్రజల కోసం భరిస్తున్నానని భావోద్వేగం చెందారు. దేశం కోసం తప్పితే ఎన్నడూ స్వార్థం కోసం ఆలోచించలేదన్నారు. తన భార్య ఏ రోజూ రాజకీయాల్లోకి రాలేదని.. అలాంటి ఆమెపై వ్యక్తిగత విమర్శలు చేయడం దుర్మార్గమన్నారు. దేశం కోసం తప్పితే ఎన్నడూ స్వార్థం కోసం ఆలోచించలేదన్నారు. తన భార్య ఏ రోజూ రాజకీయాల్లోకి రాలేదని.. అలాంటి ఆమెపై వ్యక్తిగత విమర్శలు చేయడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు కన్నీటిపర్యంతం కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

దీనిపై మాజీ మంత్రి, టీ. కాంగ్రెస్ నేత కొండా సురేఖ స్పందించారు. ఏపీ అసెంబ్లీ ఘటనను దేశం మొత్తం ఖండించాలని ఆమె పిలుపునిచ్చారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు మంచిది కాదని .. ఇటువంటి ఘటనలపై పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు గళం విప్పాలని సురేఖ అన్నారు. ఈ ఘటనపై జగన్ సోదరి, వైఎస్ షర్మిల కూడా స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ ఘటనపై సీఎం కేసీఆర్ కుమార్తె కవిత స్పందించకపోవడం విచారకరమన్నారు.

ఈ అంశంలో రోజా, లక్ష్మీపార్వతి స్పందించిన తీరు తనను ఆశ్చర్యానికి గురిచేసిందని సురేఖ వ్యాఖ్యానించారు. సాటి మహిళకు అవమానం జరిగిన వేళ రోజా శాపనార్థాలు పెట్టడం సమంజసం కాదన్నారు. లక్ష్మీపార్వతి మాటలు విన్నాక ఆమెపై ఉన్న గౌరవం కాస్తా తొలగిపోయిందని కొండా సురేఖ స్పష్టం చేశారు. రాజకీయాలు పార్టీల వరకే పరిమితం కావాలని, కుటుంబాలకు వరకు తీసుకుపోవద్దని ఆమె సూచించారు.