Konda Polam: గ్రిప్పింగ్‌గా ఉన్న కొండ పొలం ట్రైల‌ర్‌.. రెట్టింపు అయిన అంచ‌నాలు

Konda Polam: ఉప్పెన సినిమాతో మంచి విజ‌యాన్ని అందుకున్న వైష్ణ‌వ్ తేజ్ త‌న రెండో సినిమాగా క్రిష్ దర్శకత్వంలో కొండపొలం అనే సినిమా చేశారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డుతూ వచ్చింది. అక్టోబ‌ర్ 8న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు కొద్ది రోజుల క్రితం ప్ర‌క‌టించ‌గా, ఈ రోజు చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇది చాలా గ్రిప్పింగ్‌గాఉంది.

Konda Polam Trailer Has Been Released
Konda Polam Trailer Has Been Released

క్రిష్ హృదయాన్ని తాకేలా సినిమాని తెరకెక్కించినట్లు ట్రైలర్ ను చూస్తే అర్ధమవుతుంది. సినిమాలో ఎమోషన్ కూడా చాలా బాగా హైలైట్ అయింది. ఇక ఈ ట్రైలర్ లో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, కోట శ్రీనివాసరావు పాత్రలు కూడా బాగా హైలైట్ అయ్యాయి. అలాగే అడవి నేపథ్యాన్ని కూడా బాగా ఎలివేట్ చేశారు. రకుల్ మేకలు కాసుకునే పూర్తి గ్రామీణ యువతిగా కనిపించింది.

వైష్ణ‌వ్ తేజ్, ర‌కుల్ మ‌ధ్య‌స‌న్నివేశాలు ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. ట్రైలర్ మాత్రం సినిమాపై భారీ అంచనాలే పెంచింది. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా రూపోందించారు దర్శకుడు క్రిష్. రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ నవలను సినిమాగా తెరకెక్కించేందుకు కథలో కొన్ని మార్పులను చేశాడట క్రిష్. ఎక్కువ భాగం కథ నల్లమల అడవులలోని గొర్రెకాపరుల జీవితాలపై నడుస్తుంది.

బి టెక్ చేసిన ఓ కుర్రాడు.. తన తండ్రితో తమ గొర్రెలను కాపాడుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు. బిటెక్ చదివి ఫారెస్ట్ ఆఫీసర్‌గా ఎందుకు మారాడు వంటి అంశాలను అద్భుతంగా చూపించాడు క్రిష్‌. ఈ సినిమాలో ఆమె ఓబులమ్మ అనే పాత్రను చేసింది ర‌కుల్‌. క్రిష్ ఈ సినిమాను కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారట. ఈ చిత్రాన్ని వికారాబాద్ ఫారెస్ట్‌లో ఎక్కువు శాతం చిత్రీకరించారు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఆహా స్ట్రీమింగ్ సంస్థ దక్కించుకుంది.