Konda Polam: అప్పుడే కొండ పొలం ఓటీటీలోకి వ‌స్తుందా..!

Konda Polam: మెగా మేన‌ల్లుడు డెబ్యూ చిత్రం ఉప్పెన పెద్ద విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న రెండో సినిమాగా కొండ పొలం చిత్రం విడుద‌లైంది. యువ క‌థానాయ‌కుడు పంజా వైష్ణ‌వ్ తేజ్ హీరోగా న‌టించిన ఈ చిత్రానికి జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌. సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కులు ముందుకు వ‌చ్చింది.

చిత్రం పాజిటివ్ టాక్‌తోదూసుకుపోతుంది.అయితే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన యాభై రోజుల‌కు రిలీజ్‌కానుంది. బహుశా క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. అంతేకాదు ఈ స్ట్రీమింగ్ డేట్ కొద్దిగా ముందుకు కూడా జరగోచ్చని తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. అక్టోబర్ 8న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నైజాంలో 30 లక్షలకు పైగా షేర్‌ని సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాలలో సినిమా 1.1 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది.

ఈ సినిమాను 7.5 కోట్ల రేటుకి అమ్మగా సినిమా 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ సినిమా ఇంకా 6.54 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది. రెండో సినిమా కూడా వైష్ణ‌వ్‌కి మంచి హిట్ అందించ‌నున్న‌ట్టుగా తెలుస్తుంది.

కొండపొలం కథ విషయానికి వస్తే.. ఈ సినిమా ఓ ఫేమస్ నవల ఆధారంగా తెరకెక్కింది. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా రూపోందించారు దర్శకుడు క్రిష్. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ డిగ్లామర్‌గా ఓబులమ్మ అనే పాత్రను చేసింది. క్రిష్ ఈ సినిమాను కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారట.

ఇక వైష్ణవ్‌ తేజ్‌ నటిస్తున్న ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ఆయన దర్శకుడు గీరిషయ్య డైరెక్షన్‌లో ఓ సినిమాను చేస్తున్నారు. కేతిక శర్మ హీరోయిన్‌గా చేస్తోంది. భోగవల్లి ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.