Kommineni Srinivas Rao : తెలుగు దేవతలపై పవన్ కు నమ్మకం లేదు.. కొమ్మినేని శ్రీనివాస్ రావు ఫైర్..!

NQ Staff - June 20, 2023 / 09:12 AM IST

Kommineni Srinivas Rao : తెలుగు దేవతలపై పవన్ కు నమ్మకం లేదు.. కొమ్మినేని శ్రీనివాస్ రావు ఫైర్..!

Kommineni Srinivas Rao : పవన్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మొన్ననే వారాహి యాత్రను కూడా షురూ చేశారు. ఇక తన యాత్రలో వరుసపెట్టి వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన చేస్తున్న విమర్శలకు వైసీపీ నేతలు కూడా ధీటైన కౌంటర్లు ఇస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పవన్ సమాధానం చెప్పలేని విధంగా వారు కౌంటర్లు ఇస్తున్నారు.

అయితే తాజాగా ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ రావు పవన్ పై సెటైర్లు వేశారు. అసలు పవన్ కల్యాణ్‌ తాను స్పెషల్ గా డిజైన్ చేయించుకున్న వాహనానికి వారాహి అని పేరు పెట్టుకున్నారు. అసలు వారాహి అంటే మన తెలుగు దేవతల పేరు కాదు. నేపాల్ లో కొలిచే ఏడుగురు దేవతలలో ఒకరి పేరు.

అంటే పవన్ కు మన తెలుగు దేవతలపై, దైవాలపై నమ్మకం లేదన్నమాట. అలాంటి పవన్ కూడా యాగాలు, పూజల పేర్లతో జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ సీరియస్ అయ్యారు కొమ్మినేని శ్రీనివాస్ రావు. ఇన్ని రోజులు వారాహి అంటే అదేదో తెలుగు దేవత పేరు అని జనసైనికులు ప్రచారం చేశారు.

తాజాగా కొమ్మినేని శ్రీనివాస రావు అసలు గుట్టు విప్పడంతో జనసైనికులు షాక్ అవుతున్నారు. ఇదే విషయాన్ని వైసీపీ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తెలుగు దేవతలపైనే నమ్మకం లేని పవన్.. తెలుగు ప్రజల గురించి ఆలోచిస్తాడా అంటూ నిలదీస్తున్నారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us