Komatireddy Rajagopal Reddy : రాజగోపాల్ రెడ్డి చేరిక ఖాయం.. ఈటల, విజయశాంతితో చర్చలుః మాణిక్ రావు ఠాక్రే
NQ Staff - June 24, 2023 / 08:53 AM IST

Komatireddy Rajagopal Reddy : తెలంగాణలో రోజు రోజుకూ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది. ఇందుకు ప్రస్తుతం జరుగుతున్న చేరికలే నిదర్శనం అని చెప్పుకోవాలి. ఇదే విషయంపై తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావు ఠాక్రే క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరిక దాదాపు ఖాయమైందని తెలిపారు.
అలాగే బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్, విజయశాంతి, మాజీ మంత్రి డీకే అరుణతో కూడా చర్చలు జరుగుతున్నట్టు తెలిపారు. వారే కాకుండా త్వరలోనే బీఆర్ ఎస్ పెద్ద నేతలు కూడా చేరుతారంటూ బాంబు పేల్చారు. వారంతా బీజేపీలో ఇమడలేకపోతున్నారని స్పష్టం చేశారు మాణిక్ రావు ఠాక్రే. ఆయన స్టేట్ మెంట్ తో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేగుతున్నాయి.
రాజగోపాల్ రెడ్డి, డీకే అరుణ్, విజయశాంతి వీరంతా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన వారే. వీరంతా మళ్లీ పాత గూటికి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. దాంతో రాష్ట్రంలో బీజేపీలో ఆందోళన మొదలైంది. వీరంతా బీజేపీలో బలమైన నేతలుగా ఉన్నారు. వీరి రాకతోనే బీజేపీకి ఆయా జిల్లాల్లో బలం పెరిగింది.
కానీ చాలా కాలంగా వీరంతా బీజేపీలో పెద్దగా యాక్టివ్ గా ఉండట్లేదు. ఇప్పుడు వీరంతా కాంగ్రెస్ లో చేరుతుండటంతో సంచలనం రేగుతోంది. ఇదే జరిగితే తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి అని అంతా అంటున్నారు. ఇక ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరుతున్నారు.
ఇలా రాష్ట్రంలో ఉన్న కీలక నేతలంగా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మొన్నటి వరకు బీఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపి అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడంతో బీజేపీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ ఎఫెక్ట్ కాంగ్రెస్ కు బలాన్ని చేకూర్చింది. అటు కోమటిరెడ్డి వెంటక్ రెడ్డి కూడా చేరికలపై ఢిల్లీకి వెళ్లి మాట్లాడుతున్నారు.

Komatireddy Rajagopal Reddy Will Join Congress
ఇదే పరిస్థితి కొనసాగితే బీఆర్ ఎస్ నుంచి కూడా కీలక నేతలు కాంగ్రెస్ వైపు వెళ్లడం ఖాయం. ఎన్నికల సమయానికి కాంగ్రెస్ మరింత పుంజుకునే అవకాశం మెండుగా కనిపిస్తోంది. ఇప్పటికైనా బీజేపీ మేల్కొంటే బాగుంటుందని అంటున్నారు రాజకీయ నిపుణులు.