KCR : వచ్చే నెలలో తెలంగాణ అసెంబ్లీ రద్దు కాబోతుంది
NQ Staff - January 24, 2023 / 09:46 AM IST

KCR : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ని ఫిబ్రవరి లో రద్దు చేయబోతున్నట్లుగా బీజేపీ నాయకుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి జోష్యం చెప్పాడు. ఫిబ్రవరిలో అసెంబ్లీని రద్దు చేసి మే నెలలో ఎన్నికలకు కేసీఆర్ వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడంటూ రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నాడు.
ఇప్పటికే కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఓటమి తధ్యం అని భావిస్తున్నాడు. ఇంకా ఆలస్యం అయితే దారుణమైన పరాభవం ఎదువుతుందనే ఉద్దేశ్యంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నాడు అంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడు.
ఎంత ముందస్తు ఎన్నికలకు వెళ్లినా కూడా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర ప్రజలు బొంద పెట్టి.. కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు పరిమితం చేయబోతున్నట్లుగా ఆయన ఎద్దేవ చేశాడు. ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలి మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ ఊహల్లో ఉన్నాడు. కానీ అది జరగదు అన్నాడు.
వచ్చే ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకోవాలని.. జాతీయ స్థాయిలో ఏదో ప్రభావం చూపించాలని ఆశ పడుతున్న కేసీఆర్ కలలు అన్నీ కూడా కల్లలే అవుతాయి అంటూ ఈ సందర్భంగా కోమటిరెడ్డి కామెంట్స్ చేశారు.