BJP : ఈటెల, కోమటిరెడ్డిలు బీజేపీలో ఉన్నట్లా? లేనట్లా?
NQ Staff - June 22, 2023 / 07:28 PM IST

BJP : బీఆర్‌ఎస్ పార్టీ నుండి అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈటెల రాజేందర్ బయటకు వచ్చేసిన విషయం తెల్సిందే. ఆ వెంటనే బీజేపీలోకి ఆయన వెళ్లడం.. ఉప ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకోవడం వరుసగా జరిగింది. బీజేపీలో అత్యంత కీలక ప్రాముఖ్యతను ఇస్తాము అంటూ అధినాయకత్వం హామీ ఇచ్చింది.
జాయిన్ అయిన కొన్నాళ్లకు ఈటెలకు చేరికల కమిటి అప్పగించారు అంటూ వార్తలు వచ్చాయి. ఇక కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నికలో ఓడి పోవడంతో పార్టీ అధినాయకత్వం లైట్ తీసుకుంటున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అధినాయకత్వం పై అసంతృప్తిగా ఉన్న ఈ ఇద్దరు ముఖ్య నేతలు గత కొన్ని రోజులుగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే వార్తలు వస్తున్నాయి. కోమటిరెడ్డి మరియు ఈటెల ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో పాల్గొనడం లేదు.
ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించి 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటికి బీజేపీ కార్యక్రమం మొదలు పెట్టిన విషయం తెల్సిందే. కానీ ఈ కార్యక్రమానికి వీరిద్దరు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వీరు బీజేపీలో ఉన్నారా? లేదా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.