TDP Party : ఎల్లో బ్యాచ్ కు కండువాలు కప్పి మురిసిపోతున్న చంద్రబాబు..!

NQ Staff - January 27, 2024 / 12:09 PM IST

TDP Party : ఎల్లో బ్యాచ్ కు కండువాలు కప్పి మురిసిపోతున్న చంద్రబాబు..!

TDP Party :

మనకు మద్దతు ఇచ్చేవారినే నలుగురిని చేర్చుకుని భారీగా చేరికలు వస్తున్నాయంటూ అంటూ ఊదరగొట్టేయడం చూసి ఎవరైనా నవ్వుతారు. ఇప్పుడు టీడీపీ పరిస్థితి కూడా అలాగే ఉందండోయ్. ఎందుకంటే చంద్రబాబు చేస్తున్న పనులు అలాగే ఉన్నాయి. సాధారణంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను చేర్చుకుంటే ఎన్నికల్లో కలిసి వస్తుందని ఎవరిని అడిగినా చెప్పేస్తారు. కానీ చంద్రబాబుకు ఈ స్పృహ లేకుండా పోయిందని తెలుస్తోంది. ఇప్పుడు ఆయన తనకు మద్దతు ఇస్తున్న వారికే అఫిషియల్ గా కండువాలు కప్పేసి బలం పెరిగిందని ప్రచారం చేసుకుంటున్నారు.

కొలికపూడి అని ఒకాయన హైదరబాద్ లో ఉంటూ సీఎం జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకుంటాడు. నిత్యం ఎల్లో మీడియాల్లో కనిపిస్తూ జగన్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసి తనకు తానే గొప్ప లీడర్ అని బిల్డప్ ఇచ్చుకుంటాడు. నెల రోజుల్లో పెద్ద లీడర్ ఎలా అవ్వాలో ఈయనను చూసే నేర్చుకోవాలేమో. ఎందుకంటే ఈజీగా ఎల్లో మీడియాల్లో కూర్చుని జగన్ ను తిట్టేసి చంద్రబాబుకు నీరాజనాలు పట్టేస్తుంటాడు ఈ పెద్దాయన. ఇప్పటి వరకు ప్రజల్లోకి వచ్చింది లేదు.. ప్రజల గురించి ఒక్క పని చేసింది లేదు గానీ.. జగన్ ను తిడితేనే లీడర్ అని అనుకుంటున్నాడు.

ఇలాంటి వ్యక్తిని తీసుకువచ్చి చంద్రబాబు ఓ సుముహూర్తం చూసేసి తన పార్టీలోకి కండువా కప్పేసి చేర్చుకున్నాడు. ఇంకేముంది దాన్ని ఎల్లో మీడియా మొత్తం బిగ్ బ్రేకింగ్ న్యూస్ అన్నట్టు తాటికాయంత అక్షరాలతో రాసుకొచ్చేస్తున్నాయి. పెద్ద లీడర్ వచ్చి టీడీపీలో చేరిపోయాడు.. ఇక టీడీపీకి తిరుగు ఉండదని ఊదరగొడుతున్నాయి. అసలు ఆ చేరిన వ్యక్తి వల్ల టీడీపీకి ఒరిగింది ఏంటో చెబితే కాస్త బాగుండేది. కానీ ఆయన వల్ల ఆవగింజంత లాభం కూడా లేదని చంద్రబాబుకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు టీడీపీలో చేరేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు.

ఇంకోవైపు చివరకు జనసేనలోకి కూడా నాయకులు వెళ్తున్నారు. మరి తన పార్టీ ఎక్కడ తక్కువ అయిపోతుందో అనే భయం చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఇలా మరికొంత మంది తన ఎల్లో మీడియాలో తనకు వంత పాడే ఇద్దరు ముగ్గురిని కూడా అఫిషియల్ గా తన పార్టీలో చేర్చుకుంటారని తెలుస్తోంది.

ఇలా తనకు వత్తాసు పాడే వారిని నలుగురినిచేర్చేసుకుని తనదే గొప్ప పార్టీ అని బిల్డప్ ఇచ్చుకోవడానికి రెడీ అవుతున్నారు చంద్రబాబు. ఇదే ఆయన చేతకాని తనానికి నిదర్శనంగా చెబుతున్నారు కొందరు రాజకీయ విమర్శకులు. చంద్రబాబును చూసి అవతలి పార్టీల వారు వెళ్లాలి గానీ.. ఇలా తన వారికే కండువాలు కప్పి మురిసిపోవడం ఏంటని అడుగుతున్నారు.

 

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us