Rohit Sharma: రోహిత్‌ని వైస్ కెప్టెన్సీ నుండి తొలగించాల‌ని కోహ్లీ డిమాండ్

Rohit Sharma: భార‌త క్రికెట్‌లో రోహిత్ శ‌ర్మ‌,విరాట్ కోహ్లీ ఇద్ద‌రు మంచి స్టార్ ప్లేయ‌ర్స్. ఒంటి చేత్తో మ్యాచ్‌ల‌ని గెలిపించ‌గ‌ల‌రు.ఇద్ద‌రికి చెడింద‌ని ఎప్ప‌టి నుండో వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. అయితే దీనికి మరింత బ‌లం చేకూర్చేలా కోహ్లీ బీసీసీకి ఓ స‌ల‌హా ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

Kohli wanted Rohit Sharma removed from ODI vice-captaincy
Kohli wanted Rohit Sharma removed from ODI vice-captaincy

రోహిత్‌ శర్మ వయస్సు(34) దృష్ట్యా అతడిని వైస్‌ కెప్టెన్‌ పదవి నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ కోహ్లి ఈ మేరకు సెలక్షన్‌ కమిటీకి సూచన చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కోహ్లి టీ20 సారథ్య బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు ప్రకటన చేయడం గమనార్హం. అంతేగాక.. ఆరు నెలల చర్చ తర్వాతే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడని బీసీసీఐ సెక్రటరీ జై షా చెప్పడం అనుమానాలకు తావిస్తోంది.

ప్రస్తుతం పరిమిత ఓవర్ల జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని కోహ్లీ కోరినట్టు సమాచారం. అక్టోబరు 17 నుంచి యూఏఈ, ఒమన్‌లలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. నవంబరు 14 వరకు జరుగుతుంది. ఈ టోర్నీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కోహ్లీ కనుక టీ20 ప్రపంచకప్‌ను గెలవకుంటే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించి వన్డే, టీ20లకు రోహిత్‌ను కెప్టెన్‌గా నియమిస్తారన్న ప్రచారం కూడా జరిగింది.

రోహిత్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని బీసీసీఐకి సూచన చేసిన తర్వాత అతడి కెప్టెన్సీ మరింత ప్రమాదంలో పడిందని చెబుతున్నారు. రోహిత్ శర్మను వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించాలని సూచించిన తర్వాత విరాట్ కోహ్లీ నిజమైన వారసుడిని కోరుకోలేదని బోర్డు వర్గాలు అభిప్రాయపడినట్టు కూడా చెబుతున్నారు. కాగా, రోహిత్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించాలని బోర్డుకు సూచించిన కోహ్లీ.. రెండు ఫార్మాట్లలోనూ యువకులైన కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ వంటి వారికి దానిని అప్పగించాలని కోరినట్టు తెలుస్తోంది.