Pushpa Movie : పుష్ప చిత్రాన్ని తెగ ఇష్ట‌ప‌డుతున్న బాలీవుడ్‌.. కోహ్లీతో పాటు క‌ర‌ణ్ ప్ర‌శంస‌ల వ‌ర్షం

Pushpa Movie : అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం పుష్ప‌. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ‌డా విజ‌యం సాధించిన ఈ చిత్రం ప్రేక్షకులు మరియు సెలబ్రిటీల నుండి కూడా మంచి సమీక్షలను పొందింది. చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు యాక్షన్ ఎంటర్ టైనర్ లో బన్ని నటనను ప్రశంసించారు. బోనీకపూర్ కుమారుడు హీరో అర్జున్ కపూర్ పుష్పపై ప్రశంసల వర్షం కురిపించారు.

Kohli and Karan comments on Allu Arjun and Sukumar Pushpa Movie
Kohli and Karan comments on Allu Arjun and Sukumar Pushpa Movie

తాజాగా దర్శకనిర్మాత కరణ్ జోహార్ పుష్ప పై ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ అతని తాజా చిత్రం పుష్పపై ప్రశంసలు కురిపించారు. “ఈ రోజు పుష్పను వీక్షించాను. పుష్పలో అల్లు అర్జున్ ,నమ్మశక్యం కానిది.. ఎంత స్టార్ డమ్! ఎంత ప్రదర్శన. .“ అంటూ ఆశ్చర్యార్థకాలతో కూడుకున్న ప్రశంసలు కురిపించాడు. బన్ని నటన విషయంలో కరణ్ ఎంతగా ఇంప్రెస్ అయ్యారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.

Kohli and Karan comments on Allu Arjun and Sukumar Pushpa Movie
Kohli and Karan comments on Allu Arjun and Sukumar Pushpa Movie

మరోవైపు హమ్ తుమ్ – ఫనా చిత్రాల దర్శకుడు కునాల్ కోహ్లీ పుష్ప చిత్రంపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అల్లు అర్జున్ నటించిన పుష్పను ఇప్పుడే ప్రైమ్ లో చూసాను. ఇది కోవిడ్ కష్టకాలం కాకపోయి ఉంటే మీరు హిందీలో మాత్రమే 200 కోట్లు వసూలు చేసేవారు. ఇది కూడా టిక్కెట్ ధరలు పెంచాల్సిన పని లేకుండానే.

ఎంత అద్భుత సినిమా… మీరు ఎంత హీరో/స్టార్/నటుడు.. మార్డ్ ఆఫ్ ఎ పెర్ఫార్మెన్స్. హుడ్ ఆన్ చేసిన పోరాటం అద్భుతమైనది“ అని కునాల్ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఇది వన్ మ్యాన్ షో.. యాంగ్రీ యువకుడిగా సీనియర్ బచ్చన్ `సోలో` చిత్రం వంటిది పుష్ప. మార్డ్… కొడుకు… స్నేహితుడు… ప్రేమికుడు… వ్యూహకర్త.. హీరో…! అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ లో అన్నీ ఒకే క్యారెక్టర్ గా మారాయి. యాక్షన్ & డ్యాన్స్ మేకింగ్ .. కొత్త గా .. బ్రిలియంట్ గా కుదిరాయి“ అంటూ ప్రశంసించాడు.

అల్లు అర్జున్ కూడా దీనికి ప్రతిస్పందిస్తూ -“కునాల్ జీ హృదయపూర్వకంగా అభినందించినందుకు చాలా ధన్యవాదాలు. అలాంటి ఉదారమైన అభినందనలు వింటుంటే హృదయం వేడెక్కుతోంది. మీరు మాయాజాలాన్ని అనుభవించినందుకు చాలా ఆనందంగా ఉంది… సవినయంగా“ అంటూ బన్నీ స్పందించారు.