కోడెల శివప్రసాద్ వర్ధంతి వేడుకలు జరిగేనా!

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కోడెల శివప్రసాద్ అభిమానులు మరియు పోలీసులు మధ్య వార్ ప్రారంభం అయ్యింది. కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య చేసుకొని నేటి సంవత్సరం కావడంతో ఆయనను స్మరించుకుంటూ అభిమానులు వర్ధంతి వేడుకలకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ వేడుకలకు పోలీసులు అడ్డుపడుతున్నారు. కరోనా సమయం కాబట్టి ఎలాంటి వేడుకలకు అనుమతులు ఇవ్వమని అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఏపీలో పోలీసుల వ్యవహారం చాలా వింతగా కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో వైసీపీ నాయకులు మీటింగ్స్ నిర్వహించినా లేక పార్టీ కార్యక్రమాలు నిర్వహించినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు కానీ టీడీపీ నేతలు చిన్న మీటింగ్ పెట్టుకున్నా కూడా కరోనా నిబంధాలను ఉల్లంఘించారని నోటీసులు జారీ చేస్తున్నారు.

ఇప్పుడు కోడెల శివ ప్రసాద్ వర్ధంతి విషయంలో కూడా అధికారులు దురుసుగా వ్యవహరించారు. కోడెల శివ ప్రసాద్ వర్ధంతి వేడుకలు నిర్వహించకూడదని కోడెల శివరాంకు పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. కరోనా సమయం కాబట్టి కార్యక్రమం నిర్వహించకూడదని పోలీసులు వెల్లడించారు. అయితే శివరాం మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ వేడుకలను ఆపామని శివరాం వెల్లడించారు. శివరాం చేసిన ప్రకటన వల్ల సత్తెనపల్లిలో వాతావరణం వేడెక్కింది. ఈ రోజు వేడుకలు జరుగుతాయో లేదో వేచి చూడాలి. ప్రభుత్వం పెట్టిన కేసులను భరించలేకే శివప్రసాద్ మరణించారని భావిస్తున్న కోడెల అభిమానులు పోలీసుల నిబంధనలను పాటిస్తారో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here