ఎన్నికల బరిలో కోదండం

Advertisement

తెలంగాణాలో రెండు ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే దింట్లో ఒక ఎమ్మెల్సీ బరిలో తెలంగాణ జన సమితి పార్టీ కూడా పోటీ చేయాలనీ నిర్ణయం తీసుకుంది. అయితే కోదండరాం ఆధ్వర్యంలో నిన్న నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం అయ్యింది. అయితే వచ్చే ఏడాది పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ విషయం పై సమావేశంలో చర్చించారు.

అయితే వరంగల్, ఖమ్మం, నల్గొండ నుండి కోదండరాం బరిలోకి దిగితే బాగుంటుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. ఇక నిర్ణయం ఏదైనా సమష్టిగా తీసుకోవాలని కోదండరాం కోరారు. అలాగే మరో సారి సమావేశం అయ్యి తుది నిర్ణయం తీసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నారు. అలాగే దుబ్బాక స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో దానిపై కూడా నివేదిక వేయాలని సమావేశంలో వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here