Kodali Nani : ఆంధ్రప్రదేశ్ లో అసైన్డ్ భూముల వ్యవహారం రచ్చ మాములుగా లేదు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేతకు ఈ విషయమై సీఐడీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. అయితే నోటీసులివ్వడం, వాటిపై చంద్రబాబు స్టే తెచ్చుకోవడం వంటివి చక చక జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందించారు.

ఈ దేశ రాజకీయ వ్యవస్థలో అత్యంత పిరికి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అయన ఒక్క చంద్రబాబే అన్నారు. విచారణలు ఎదుర్కొలేని వ్యక్తిగా చంద్రబాబు చరిత్ర లో నిలిచిపోతాడని, ఈ విషయంలో భారత దేశంలో ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.. అంతేకాదు ఆయనకు ఓ కొత్త పేరు కూడా పెట్టాడు.. ఇప్పటినుంచి ఆయనను చంద్రబాబు అని కాకుండా స్టే బాబు అని పిలవాలని విమర్శించారు. స్టే ల బాబు ఎప్పటిలాగానే మళ్ళీ స్టే తెచ్చుకున్నాడని ఎద్దేవా చేశాడు.
హై కోర్టు లో క్వాష్ పిటిషన్ వేసి ఈ కేసును త్వరగా పూర్తి చేయమని కోరిన చంద్రబాబు నాలుగు వారాలు స్టే తెచ్చుకున్నారు. చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేయడం తో పాటు పలుకుబడిని ఉపయోగించుకుని కోర్టుల్లో కేసుల్లో స్టే లు తెచ్చుకుంటాడని కొడాలి నాని విమర్శించారు. సుప్రీం కోర్టు నుంచి కోట్లు ఖర్చు పెట్టి లాయర్లను తెచ్చుకుంటారన్నారు. కేసుల నుంచి తాత్కాలికంగా తప్పించుకున్నా ప్రజా కోర్టు నుంచి తప్పించుకోలేరన్నారు. చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికే చెప్పిన బుద్ధి కాకుండా మరొకసారి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం గా ఉన్నారన్నారు.