Kodali Nani : పవన్ ను రోడ్డు పక్కన కుక్కను కాల్చినట్లు కాల్చేస్తారు
NQ Staff - January 28, 2023 / 03:00 PM IST

Kodali Nani : పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి కొడాలి నాని మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కు వ్యతిరేకంగా తీవ్రవాది మాదిరిగా వ్యవహరిస్తానంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నాని స్పందించారు.
పవన్ కళ్యాణ్ తీవ్రవాది అయితే కాల్చి పడేస్తారని, రోడ్డు పక్కన కుక్కను కాల్చినట్లుగా కాల్చి వేస్తారని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ తీవ్రవాది అయితే ఏం చేస్తాడు.. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని అడిగితే పవన్ వారిని చంపేస్తాడా అంటూ నాని ప్రశ్నించారు.
తమ గళాన్ని వినిపించడానికి ప్రజలు రోడ్డు ఎక్కితే పవన్ కళ్యాణ్ తీవ్రవాది అయ్యి వారిని ఏం చేస్తాడు అంటూ నాని ప్రశ్నించాడు. రాష్ట్రం ముక్కలు కాకుండా ఉండడానికి మూడు ప్రాంతాల అభివృద్ధి విధానం తీసుకున్నామని.. మూడు రాజధానుల అంశాన్ని జగన్ ప్రభుత్వం తీసుకుందని నాని పేర్కొన్నాడు.
రాష్ట్ర విభజనకు మద్దతు పలికిన పార్టీల చంక ఎక్కిన పవన్ కళ్యాణ్ వారిని ఎందుకు ప్రశ్నించడం లేదంటూ నాని ఎద్దేవా చేశాడు. అందరూ కట్ట కట్టుకుని వచ్చినా కూడా జగన్ ని ఏం చేయలేరని వెంట్రుక కూడా పీకలేరని నాని పేర్కొన్నాడు. నేను బతికున్నంత కాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగనే అంటూ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.