Kodali Nani : రజినీకాంత్ పై సంచలన కామెంట్స్ చేసిన కొడాలి నాని.. బుద్ధిలేదంటూ..

NQ Staff - April 29, 2023 / 07:57 PM IST

Kodali Nani  : రజినీకాంత్ పై సంచలన కామెంట్స్ చేసిన కొడాలి నాని.. బుద్ధిలేదంటూ..

Kodali Nani  : తెలుగు ప్రజల అభిమాన హీరో ఎవరు అంటే సీనియర్ ఎన్టీఆర్ అనే చెప్పాలి.. ఈయనకు ఉన్న అభిమానులు తెలుగులో మరే ఇతర హీరోకు లేరు అంటే అతియసోక్తి కాదేమో.. మరి అలాంటి హీరో శతజయంతి వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి.. ఈ వేడుకలకు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా విచ్చేసిన విషయం తెలిసిందే.. ఈయన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసారు..

అంతేకాదు ఎన్టీఆర్ గురించి అలాగే నందమూరి బాలకృష్ణ, నారా చంద్రబాబు నాయుడు గురించి కూడా తనదైన శైలిలో మాట్లాడారు.. అయితే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో పాల్గొన్న రజినీకాంత్ పై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.. ఈయనపై వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి.. వివరాల్లోకి వెళ్తే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విజయవాడ పోరంకి అనుమోలు గార్డెన్స్ లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగగా.. ఈ వేడుకకు రజినీకాంత్ హాజరయ్యారు.. దీంతో వైసీపీ నేతలు గరంగరం అయ్యారు.. ఈ విషయంపై కొడాలి నాని మాట్లాడూతూ.. రజినీకాంత్ మీద తీవ్ర విమర్శలు చేసారు.. ఏపీలో జీరో అయిన రజినీకాంత్.. బుద్ధి జ్ఞానం లేకుండా చంద్రబాబును పొగుడుతున్నారు.

చంద్రబాబు కుటిల నీతి గురించి జనసేన అధినేత పవన్ గుర్తించాలని.. ఆయనను బ్లాక్ మెయిల్ చేయడం కోసమే రజినీకాంత్ ను రంగంలోకి దింపారని.. ఇప్పటికైనా పవన్ కళ్ళు తెరచి తన చుట్టూ ఏం జరుగుతుందో.. ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాలని చెప్పుకొచ్చారు.. అలాగే ఎన్టీఆర్ బతికి ఉండగా ఒక్కసారి కూడా పట్టించుకోకుండా ఇప్పుడు ఆయన గురించి తెగ పొగిడేస్తున్నారని విరుచుకు పడ్డారు..

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us