Kodali nani: ఎన్టీఆర్ మాటలు మేం వినాలా.. ఆయ‌న మ‌మ్మ‌ల్ని ఎలా కంట్రోల్ చేస్తారు..నాని కామెంట్స్

Kodali nani: ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం చాలా రంజుగా ఉంది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలు చేసిన సంద‌ర్భంలో బాల‌కృష్ణ, క‌ళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. అయితే ఎన్టీఆర్ మాట‌ తీరు బాగోలేదని అభిప్రాయపడ్డారు. మేనత్తను నోటికొచ్చినట్లు మాట్లాడితే వాటిని ఖండించడంలో మేనల్లుడిగా జూనియర్ ఎన్టీఆర్ విఫలం అయ్యారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

TheNewsQube-
kodali nani counter on ntr
kodali nani counter on ntr

ఇదే విషయాన్ని రాష్ట్రం మొత్తం అనుకుంటుందని చెప్పారు. నారా దంపతులకు వర్ల దంపతుల మద్దతు అనే నినాదంతో వర్ల రామయ్య దంపతులు విజయవాడలోని ఆయన స్వగృహంలో 12 గంటల నిరసన దీక్ష చేపట్టారు. అయితే తాజాగా మంత్రి కొడాలి నాని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చేసింది మానవ తప్పిదం..జగన్ పై నుంచి నీళ్లు పోసాడా..? అని ప్రశ్నించారు. భార్యను అల్లరి చేసుకుంటున్న పచ్చి రాజకీయ వ్యభిచారి చంద్రబాబు అని ఆరోపించారు.

అసెంబ్లీలోగానీ, బయటగానీ ఆమె పేరును తాము ప్రస్తావించలేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. చంద్రబాబు తన భార్యను తానే అల్లరి చేసుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను అనని మాటలకు తానెందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు.

జూనియర్ ఎన్టీఆర్ తమను ఎలా కంట్రోల్ చేస్తాడని నాని అన్నారు. ఆయన చెబితే తామెందుకు వింటామన్నారు. నందమూరి కుటుంబమంటే సీఎం జగన్ కూ గౌరవమేనన్నారు. నందమూరి కుటుంబ సభ్యులు అమాయకులన్నారు. గొర్రె కసాయివాడినే నమ్ముతుందన్నట్టు.. నందమూరి కుటుంబ సభ్యులు చంద్రబాబును నమ్ముతున్నారని చెప్పుకొచ్చారు.

kodali nani counter on ntr1
kodali nani counter on ntr1

ఓ పది మందిని మా ఇంటికి పంపితే నేనెందుకు క్షమాపణలు చెప్పాలన్నారు. అతని భార్యను అతను అల్లరి చేసుకుంటూ నన్ను క్షమాపణ చెప్పమంటాడేమిటని ఆయన వాపోయారు. నేను సెక్యూరిటీ పెంచుకోవడం లేదు..నేను వదిలేస్తా..ఆయన్ని జడ్ ప్లస్ వదిలేయమనండి. గొర్రె కసాయి వాడినే న్నమ్ముతుంది..చంద్రబాబు ఏది చెప్పినా నమ్మేస్తారు. అంటూ నందమూరి కుటుంబాన్నిఉద్దేశించి వ్యాఖ్యానించారు నాని.