KL Rahul : లవర్ తో రాహుల్‌ డిన్నర్‌.. సోషల్‌ మీడియా ట్రోల్స్‌

NQ Staff - November 12, 2022 / 09:29 AM IST

KL Rahul : లవర్ తో రాహుల్‌ డిన్నర్‌.. సోషల్‌ మీడియా ట్రోల్స్‌

KL Rahul : టీ20 వరల్డ్ కప్ 2022 లో భారత్ సెమీ ఫైనల్ నుండి వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఇంగ్లాండు తో సెమీ ఫైనల్ మ్యాచ్ లో దారుణమైన పరాజయం పాలైన టీమిండియా ఫైనల్ లో పాకిస్తాన్ తో తలపడే అవకాశాన్ని కోల్పోయింది.

మరో సారి టీ20 వరల్డ్ కప్ దక్కించుకునే అద్భుతమైన అవకాశాన్ని టీమిండియా చేజేతులా జార్చుకుంది. ఇండియా ఓడిపోవడం కి ఒక కారణం కేఎల్ రాహుల్ విఫలం అవ్వడం అంటూ క్రికెట్ అభిమానులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సిరీస్ మొత్తం ఆయన దారుణంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేఎల్ రాహుల్ పై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియాలో తన ప్రియురాలు తో కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్లి డిన్నర్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

రాహుల్ మరియు అతియా శెట్టి కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. క్రికెట్ ఆడేందుకు బీసీసీఐ వారు రాహుల్ ని ఆస్ట్రేలియా పంపిస్తే ఇలా ప్రియురాలితో కలిసి ఎంజాయ్ చేయడం వల్లే టీమిండియా కు దారుణమైన నష్టం జరిగింది అంటూ క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక మీదట రాహుల్ తన ఆట తీరని మార్చుకోక పోతే జట్టులో కొనసాగించవద్దంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాహుల్ మరియు అతియా శుట్టి ల మధ్య ప్రేమ విషయం గత కొన్ని రోజులుగా నడుస్తున్నా అందరికీ తెలిసిన విషయమమైనప్పటికీ ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది.

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us