KL Rahul : వైభవంగా టీం ఇండియా స్టార్ వివాహ వేడుక
NQ Staff - January 23, 2023 / 09:24 PM IST

KL Rahul : టీం ఇండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ మరియు హీరోయిన్ అతియా శెట్టి గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొదట ప్రేమలో ఉన్నట్లు వచ్చిన వార్తలను రాహుల్ మరియు అతియా శెట్టి కొట్టి పారేశారు.
ఆ తర్వాత ఇద్దరు కూడా పలు సందర్భాల్లో మీడియా కంట పడ్డారు, ఆ తర్వాత అవును మేమిద్దరం ప్రేమలో పడ్డాం అంటూ అధికారికంగా ప్రకటించారు. అతియా శెట్టి తండ్రి బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి అనే విషయం తెలిసిందే.
ఆ మధ్య సునీల్ శెట్టి కూడా తన కూతురు ప్రేమ విషయానికి సంబంధించి అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. 2019 నుండి వీరిద్దరూ రిలేషన్ లో కొనసాగుతున్నారని సమాచారం అందుతుంది. ఎట్టకేలకు వీరు పెళ్లి చేసుకొని ఒక ఇంటి వారయ్యారు.
నేడు ముంబైలోని సునీల్ శెట్టి ఇంట్లో ఈ వివాహం జరిగింది. వివాహానికి టీమిండియా కు చెందిన పలువురు ప్రముఖ క్రికెటర్లు మరియు బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారట. పెళ్లికి సంబంధించిన ఫోటోలను కేఎల్ రాహుల్ మరియు అతియా శెట్టి అభిమానులతో షేర్ చేసుకున్నారు.
మేము ఇద్దరం ఒక్కటి అవ్వడం చాలా సంతోషంగా ఉందని, మేమిద్దరం కలిసి చేయబోతున్న ఈ ప్రయాణానికి మీ ఆశీర్వాదాలు కావాలి. మా ఈ జర్నీ లో సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ కొత్త జంట ఈ ఫోటోలను షేర్ చేశారు.

KL Rahul and athiya shetty wedding 1