IPL 2021 : ఐపీఎల్ ప్లేయర్లకు కరోనా.. ఆ ఐపీఎల్ మ్యాచ్ వాయిదా

IPL 2021 : ఐపీఎల్ మ్యాచులకు కూడా కరోనా గండం తాకింది. ఐపీఎల్ మ్యాచులను బయోబబుల్స్ పెట్టి మరీ ఆడిస్తున్నా.. వాటిని దాటుకొని కరోనా ఐపీఎల్ ప్లేయర్స్ కు సోకుతోంది. దేశంలోని అన్ని స్టేడియాల్లో బయోబబుల్స్ ఉపయోగించి.. ఐపీఎల్ మ్యాచ్ లను ఆడిస్తున్నామని బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు అయితే ఐపీఎల్ మ్యాచులు కరోనా వల్ల వాయిదా పడలేదు. కానీ… తాజాగా కొందరు ప్లేయర్లకు కరోనా సోకిందని తేలింది.

KKR v RCB ipl match postponed amidst COVID scare
KKR v RCB ipl match postponed amidst COVID scare

కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు పాట్ కమిన్స్ కు కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. అలాగే వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కు కూడా కరోనా పాజిటివ్ గా తేలడంతో ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న కేకేఆర్ మ్యాచ్ వాయిదా పడింది. దాన్ని రీషెడ్యూల్ చేశారు.

కొందరు కేకేఆర్ స్టాఫ్ కు కూడా కరోనా సోకిందట. అయితే… బయోబబుల్ దాటుకొని కరోనా వైరస్… స్టేడియాల లోపలికి ఎలా ప్రవేశిస్తుందో అర్థం కావడం లేదు. మరి.. ఈ కరోనా సెకండ్ వేవ్.. కేవలం కేకేఆర్ ప్లేయర్లకే అంటుకుందా… లేక ఇతర టీమ్ లు కూడా కరోనా బారిన పడ్డాయా అనే విషయం తేలాల్సి ఉంది.

Advertisement