Popula Pette : మనకు అందరికీ పోపుల పెట్టె తెలుసు. ప్రతి వంటింట్లో పోపుల పెట్టె ఉండాల్సిందే. పోపుల పెట్టె ఉంటేనే అది వంటిల్లు అవుతుంది. అయితే.. పోపుల పెట్టె అనగానే మనం చాలా ఈజీగా తీసుకుంటాం కానీ.. పోపుల పెట్టెలోనే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని… పోపుల పెట్టెలో ఉండే దినుసుల వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తరిమికొట్టొచ్చని మీకు తెలుసా? పదండి… అసలు పోపుల పెట్టెలో ఎటువంటి దినుసులు ఉంటాయి.. వాటి వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నిజానికి చాలామంది తమ పోపుల పెట్టెల్లో ధనియాలు, పసుపు, మెంతులు, జీలకర్ర, ఆవాలను ఉంచుతారు. ఈ ఐదు రకాల పదార్థాలతో ఎన్నో రకాల సమస్యలను నయం చేసుకోవచ్చు.
ధనియాలు అయితే.. జీర్ణక్రియకు చాలా చక్కగా పనిచేస్తాయి. అందుకే మసాలాలో ఎక్కువగా ధనియాలను వాడుతారు. కొందరైతే ప్రతి కూరలో కొన్ని ధనియాలను వేస్తుంటారు. ధనియాలు నిద్రకు మంచి ఔషధంలా పనిచేస్తాయి. కొన్ని ధనియాలను తీసుకొని వాటితో కషాయం చేసి… ఆ కషాయంలో కాసింత చక్కెర కలుపుకొని తాగితే మంచిగా నిద్ర పడుతంది. తలనొప్పితో బాధపడేవాళ్లు… వేడి ఎక్కువగా ఉన్నవాళ్లు కూడా ధనియాలను బాగా నూరి తల మీద రుద్దుకొని కాసేపు విశ్రాంతి తీసుకుంటే శరీరంలోని వేడి తగ్గడంతో పాటు తలనొప్పి కూడా తగ్గుతుంది.
ఇక పసుపు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. పసుపు రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు… రక్తాన్ని శుద్ధి చేస్తుంది. పసుపు వల్ల కలిగే లాభాలు దేనివల్లా కలగవు. అందుకే పసుపును ప్రతి కూరల్లో వేస్తుంటారు.
మెంతులు.. తింటే కొంచెం చేదుచేదుగా ఉన్నా… మెంతుల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మెంతులు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్టరాల్ ను తీసేస్తాయి. మలబద్ధకం, జీర్ణ సంబంధమైన సమస్యలతో బాధపడేవాళ్లు… మెంతులను రాత్రి నానబెట్టి… ఉదయమే తింటే ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
ఏ కూర వండినా ముందు జీలకర్రను వేయడం ఆనవాయితీ. జీలకర్ర వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అజీర్తి సమస్యలు ఉన్నా…. కడుపు ఉబ్బరంగా ఉన్నా.. జీలకర్రను తీసుకోవాలి. జీలకర్రలో కాసింత నిమ్మరసం కలుపుకొని తాగితే… ఎన్నో రకాలుగా ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.
ఆవాలు… చూడటానికి చిన్నచిన్నగా ఉంటాయి కానీ… ఆవాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కీళ్ల నొప్పులు తగ్గాలన్నా.. రక్తపోటును తగ్గించాలన్నా…. చెడు కొవ్వును కరిగించాలన్నా.. అది ఆవాల వల్లనే సాధ్యం. అందుకే…. ప్రతి కూరలో ఆవాలును వాడుతుంటారు.