Kishan Reddy : పసలేని ఆరోపణలు చేస్తున్న కిషన్ రెడ్డి.. ఇలా అయితే కష్టమే..!
NQ Staff - November 16, 2023 / 12:04 PM IST

Kishan Reddy :
కిషన్ రెడ్డికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రెండోసారి పదవి ఇచ్చారు. అలాంటప్పుడు మరింత చురుగ్గా పనిచేయాల్సింది పోయి.. ఆయన మాత్రం నెమ్మదిగా పనిచేస్తున్నారు. అంతే కాకుండా కేసీఆర్ మీద, బీఆర్ ఎస్ గవర్నమెంట్ మీద విమర్శలు గుప్పించడంలో కూడా పెద్దగా సక్సెస్ కావట్లేదు. కిషన్ రెడ్డి ఒక ప్రస్ మీట్ పెట్టినా.. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రచారం చేసినా సరే పెద్దగా ఆదరణ దక్కట్లేదు. అసలు బండి సంజయ్ ను పక్కకు పెట్టనిప్పటి నుంచే బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఇప్పుడు బీజేపీ అంటే బండి సంజయ్ హయాంలో మాత్రమే డెలవప్ అయిందని చెప్పొచ్చు.
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడే సమయంలో సంజయ్ ను తప్పించడమే బీజేపీ అధిష్టానం చేసిన అతిపెద్ద పొరపాటు. దాని వల్ల యూత్ మొత్తం పార్టీకి దూరం అవుతున్నారు. అంతే కాకుండా కీలక నేతలు కూడా పార్టీని వీడుతున్నారున. ఇక కిషన్ రెడ్డి కూడా కేసీఆర్ కు ధీటుగా జవాబు ఇవ్వలేకపోతున్నాడు. ఆయన నిన్న మాట్లాడుతూ చేసిన కామెంట్లు ఎంత పలచగా ఉన్నాయో అర్థం అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ చెప్పారు. కానీ ఎక్కడ పాల్గొన్నాడు, అసలు ఏం చేశాడో సాక్ష్యాలతో చూపిస్తే ఇంకా బాగుండేది.
అదే కాకుండా గజ్వేల్ లో ధరణి బాధితులు నామినేషన్ వేస్తే.. వారిని ఇబ్బంది పెట్టారని కిషన్ రెడ్డి చెబుతున్నారు. కానీ అదే బాధితులను తీసుకువచ్చి తమను కేసీఆర్ బెదిరిస్తున్నారంటూ ఒకరిద్దరితో చెప్పించినా సరే కిషన్ రెడ్డికి హైప్ వచ్చేది. కానీ అలా జరగలేదు. ఇక గజ్వేల్ లో కేసీఆర్ ఓడిపోతాననే భయంతోనే కామారెడ్డికి వెళ్లాడంటూ అందరూ చేసిన విమర్శనే చేశాడు కిషన్ రెడ్డి. ఆల్రెడీ ఒకరు చేసిన విమర్శలు, తిట్టిన తిట్లను ప్రాక్టీస్ చేసి తిడుతున్నట్టే ఉన్నాయి తప్ప.. స్వతహాగా ఆయన ట్రెండ్ ను క్రియేట్ చేయలేకపోతున్నారు. అదే ఆయనకు పెద్ద మైనస్ గా మారుతోంది.
ఇక కామారెడ్డిలో కేసీఆర్ ను గెలిపించడం కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని చెప్పడం మహా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి స్వయంగా పోటీకి దిగుతున్నాడు. ఈ ఇద్దరికీ ఎవరంటే ఎవరికీ పెద్దగా పడదు. ఇలాంటి వారు పోటీకి దిగుతుంటే.. కిషన్ రెడ్డి ఇలాంటి పసలేని కామెంట్లు చేయడం ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు.
ఇలా ప్రతిసారి ఏదో ఒక పసలేని పట్టులేని విమర్శలు చేసేసి చేతులు దులుపుకుంటున్నాడు తప్పిస్తే.. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి లాగా బలంగా ఏదీ మాట్లాడట్లేదు. రేవంత్ లాగా బలంగా కొట్లాడట్లేదు. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీకి గ్రాఫ్ పడిపోయిందని చెప్పుకోవాలని అంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు.