తన వద్ద పనిచేసే కూలీలను విమానంలో తిరుపతి తీసుకు వెళ్లిన గొప్ప యజమాని

NQ Staff - October 2, 2022 / 11:30 AM IST

తన వద్ద పనిచేసే కూలీలను విమానంలో తిరుపతి తీసుకు వెళ్లిన గొప్ప యజమాని

చాలా మంది యజమానులు తమ వద్ద పనిచేసే కూలీలకు ఉద్యోగస్తులకు నెలవారి లేదా రోజువారి చెల్లింపులు చేస్తున్నాం కదా అని వారి బాగోగుల గురించి అస్సలు పట్టించుకోరు. వారు ఏమైతే మాకేంటి వారు చేస్తున్న పనికి డబ్బులు ఇస్తున్నాం వారి గురించి అంతకు మించి పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి అంటూ కొందరు చాలా నిర్దయగా వ్యవహరిస్తూ ఉంటారు.

కానీ కొందరు మాత్రం తమ సంస్థలో పనిచేసే వారిని తమ కుటుంబ సభ్యులుగా భావించి, వారిని గౌరవించడం మనం చూస్తూ ఉంటాం. తాజాగా ఒక యజమాని తన సంస్థలో పనిచేసే వారిని ఏకంగా విమానం ఎక్కించి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శనం చేయించారు. వారి యొక్క ఆనందానికి కారణమయ్యారు. తాజాగా ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి లో జరిగింది. ఇంద్రవెల్లిలో కిరాణా షాపు నడుపుతున్న అజీజ్ హిరాణీ అనే ఒక ముస్లిం వ్యక్తి వద్ద 15 మంది నిరుపేద కూలీలు చాలా సంవత్సరాలుగా పని చేస్తున్నారు.

వారికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో అజీజ్ వారిని తిరుపతికి పంపించారు. అజీజ్ కుమార్తె ఇటీవలే ఆస్ట్రేలియాలో పైలట్ గా శిక్షణ పూర్తి చేశారు. త్వరలో ఉద్యోగంలో జాయిన్ కాబోతున్నారు. ఈ సందర్భంగా తన వద్ద పనిచేసే కూలీలకు అజీజ్ విమానం ఎక్కించారు.

15 మంది కూలీలను హైదరాబాదు నుండి తిరుపతికి తన సొంత ఖర్చులతో తీసుకు వెళ్లి అక్కడ శ్రీవారి దర్శనం చేయించారు. కేవలం శ్రీవారి దర్శనంతో ముగించకుండా వారికి నాలుగైదు రోజుల హాలీడే ట్రిప్పు గా పలు రిసార్ట్స్ కి తీసుకు వెళ్లి పూర్తి ఖర్చుని తానే భరించారు.

ఇలాంటి యజమాని నిజంగా అరుదుగా ఉంటారు, ఈయన మనస్సు గొప్పదంటూ కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఎయిర్పోర్ట్ మొహం కూడా చూడని వారు ఏకంగా విమానంలో తిరుపతి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us