kiran abbavaram సోద‌రుడి మ‌ర‌ణంతో దిగ్భ్రాంతి చెందిన యువ హీరో.. ఇలా ప‌రిచ‌యం చేయాల్సి వ‌స్తుంద‌ని ఊహించ‌లేదు

kiran abbavaram: టాలీవుడ్‌లో ఇటీవ‌ల జ‌రిగిన విషాదాలు సినీ ప్రేక్షకుల‌ని తీవ్ర విషాదంలోకి నెట్టాయి.చాలా త‌క్కువ గ్యాప్‌లోనే చాలా మంది ప్ర‌ముఖులు క‌న్నుమూసారు. దర్శకుడు నాగేశ్వరరావు, డాన్స్ మాస్టర్ శివ శంకర్ మరణానంతరం గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా తనువు చాలించడంతో ప్రముఖులతో పాటు అభిమానులు కూడా చాలా బాధ పడ్డారు.

kiran abbavaram worried about his brother
kiran abbavaram worried about his brother

సీతారామ‌శాస్త్రి మ‌ర‌ణాన్ని జీర్ణించుకోకుమందే కిరణ్ అబ్బవరం ఇంట్లో కూడా పెను విషాదం చోటుచేసుకోవడం అందరినీ కలిచివేసింది. ఆయన సోదరుడు రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కడప జిల్లా చెన్నూరు మండలంలో బుధవారం యాక్సిడెంట్ జరిగింది. ఇక సోదరుడి మరణ వార్తపై కిరణ్ మొదటిసారి సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ గా వివరణ ఇచ్చారు.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న కిరణ్ ‘రాజావారు రాణిగారు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. కిరణ్‌ అబ్బవరం ఆ తరువాత ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ చిత్రంతో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు.

కిరణ్ అబ్బవరం తన సోదరుడు మృతిపై మొదటిసారి సోషల్ మీడియా ద్వారా ఈ విధంగా స్పందించారు. ‘రేయ్ కిరణ్.. మన ఊరికి సరిగ్గా రోడ్డు కూడా లేదు. మన ఇద్దరిలో ఎవరో ఒకరం అయినా ఏదో ఒకటి గట్టిగా సాధించాలి రా.. అని తనకి వీలైన దానికంటే ఎక్కువ సపోర్ట్ చేసే వాడు. నా కోసం ఎన్నో త్యాగం చేశాడు. తన లగ్జరీ లైఫ్ ను కూడా వదులుకున్నాడు. నన్ను హీరోగా చూడడం కోసం ఎన్నో చేశాడు.. అని కిరణ్ తెలిపాడు.

ఇక ఇప్పుడిప్పుడే ఏదో సాధిస్తున్నాను అనే టైంలోనే అతను లేకుండా వెళ్ళిపోయాడు. తను ఎప్పుడు అడిగే వాడు నన్ను ఎప్పుడు పరిచయం చేస్తావు రా అందరికీ అని.. ఇంకా ఏదైనా గట్టిగా సాధించిన తర్వాత పరిచయం చేద్దాం అనుకున్నాను. కానీ ఇలా చేయవలసి వస్తుందని అనుకోలేదు. నా వెనక ఉన్నది మా అన్న రామంజులు రెడ్డి.. ఆయన ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు.. అని కిరణ్ అబ్బవరం తెలియజేశాడు.

kiran abbavaram brother passed away in road accident1
kiran abbavaram brother passed away in road accident1

తన కుటుంబంలో జరిగిన విషధాలు మరో కుటుంబంలో జరగకూడదు అనేలా కిరణ్ మరొక వివరణ ఇచ్చారు. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఆనందం కోసం కష్టపడే వాళ్ళు ఉంటారు. అది మీరు పొందకుండా పోతే వాళ్ళు తట్టుకోలేరు అంటూ కిరణ్ అబ్బవరం చాలా ఎమోషనల్ గా తన అన్నయ్య గురించి వివరణ ఇచ్చాడు.