ఐపీఎల్ : తీసుకుంది 11 కోట్లు.. చేసింది 48 పరుగులు
Admin - October 10, 2020 / 06:15 AM IST

యూఏఈ వేదికగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ అట్టహాసంగా సాగుతుంది. ఇక అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్లేయర్స్ ను ప్రశంసలు కురిపిస్తుంటే, సరిగ్గా ఆడకుండా విఫలం అయ్యే ప్లేయర్ల పై విమర్శలు కురిపిస్తున్నారు అభిమానులు. అయితే తాజాగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ప్లేయర్ మాక్స్ వెల్ పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇక ఈ సీజన్ కు మాక్స్ వెల్ 11 కోట్ల పారితోషికం తీసుకున్నాడు. కానీ ఇప్పటివరకు కేవలం 48 పరుగులు మాత్రమే చేసాడు.
ఇక దీనితో నెటిజన్లు మాక్స్ వెల్ పై మండిపడుతున్నారు. కోట్ల రూపాయలు తీసుకున్నప్పటికీ బ్యాటింగ్ లో మాత్రం విఫలం చెందుతున్నాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఆ జట్టు యాజమాన్యం కూడా అతడి పై అసహనంగా ఉందని తెలుస్తుంది. మరి వచ్చే మ్యాచ్ లలో అయిన తన ఆట తీరులో మార్పులు చేస్తాడో.. లేదో.. అని క్రికెట్ అభిమానులు వేచి చేస్తున్నారు.