కిక్ శ్యామ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

Advertisement

నటుడు కిక్ శ్యామ్ ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేసారు. చెన్నై లోని కోడంబాక్కమ్ ప్రాంతం‌లో పోకర్ క్లబ్‌ని నడుపుతున్నాడు. అయితే ఈ మధ్య సినిమాలు తీయడం చాలా వరకు తగ్గించాడు. ఎందుకంటె శ్యామ్ పోకర్ క్లబ్ ని రన్ చేయడం పై దృష్ఠి పెట్టాడు. అయితే శ్యామ్ కొంత కాలంగా గ్యాంబ్లింగ్ కి పాల్పడుతున్నట్లు చెన్నై పోలీసులు గుర్తించారు.

తాను నిర్వహిస్తున్న పోకర్ క్లబ్ లో అనుమతులు లేకుండా పేకాట, బెట్టింగ్ లు నిర్వహిస్తున్నాడని పోలీసులు శ్యామ్ పై కేసు నమోదు చేసారు. ఇక ఇప్పటివరకు తెలుగులో శ్యామ్ కిక్, ఊసరవెల్లి , కత్తి, రేసుగుర్రం వంటి సినిమాలో నటించాడు. అలాగే శ్యామ్ కు తెలుగు, తమిళ్ భాషల్లో సపోర్టింగ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు కూడా ఉంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here