శ్రీ ధన్వంతరి నారాయణ మహాగణపతిగా ఖైరతాబాద్ గణపతి

Advertisement

కరోనా నేపథ్యంలో ఈ సారి ఖైరతాబాద్ శ్రీ మహా గణపతి ఉత్సవాలు నియమ నిబంధనల ప్రకారం జరుగనున్నాయి. అయితే తాజాగా ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహ తయారీ ప్రారంభం అయింది. ఈ ఏడాది మహా విష్ణువు రూపంలో ఖైరతాబాద్ మహా గణపయ్య దర్శనం ఇవ్వనున్నాడు. అలాగే ఒక వైపు లక్ష్మిదేవి మరోవైపు సరస్వతి దేవిల విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ గణపయ్యకు శ్రీ ధన్వంతరి నారాయణ మహాగణపతిగా గణేష్ ఉత్సవ కమిటీ నామకరణం చేసింది.

అయితే ఈ విగ్రహాన్ని మట్టితో తయారు చేసి అదే స్థానంలో నిమజ్జనం చేయనున్నారు. అలాగే భక్తులకు 9 అడుగుల ఎత్తులో దర్శనం ఇవ్వనున్నాడు. కేవలం ఆన్ లైన్ ద్వారానే దర్శనం చేసుకోవాలి అని ఉత్సవ కమిటీ తెలిపింది. అలాగే తీర్థప్రసాదాలు ఈ సారికి ఉండబోవు అని వెల్లడించారు. 11 రోజుల పాటు కమిటీ సభ్యులు మాత్రమే పూజలు నిర్వహిస్తారని తెలిపారు. కావున భక్తమహాశేయులు సహకరించాలని గణేష్ ఉత్సవ కమిటీ సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here