కొలువుతీరిన ఖైరతాబాద్ మహా గణపతి
Admin - August 22, 2020 / 08:34 AM IST

కరోనా కారణంగా గణేష్ ఉత్సవాలు సాదా సీదాగా జరుగుతున్నాయి. దేశంలోనే అత్యంత పేరు గాంచిన ఖైరతాబాద్ మహా గణపతి ఈ ఏడాది 9 అడుగుల ఎత్తుకే పరిమితం అయ్యాడు. అయితే ఈ ఏడాది ధన్వంతరీ నారాయణ మహాగణపతి రూపంలో గణపయ్య భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఉదయం 10.30గంటలకు ఖైరతాబాద్ గణేషుడు తొలి పూజ అందుకున్నాడు. కరోనా నేపథ్యంలో భక్తులకు అనుమతి లేకున్నా దర్శనానికి వస్తున్నారు.
ఇక ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి పూజలు జరుగుతున్నాయి. అలాగే ఈ మహా గణపతి ని దర్శించుకోవడానికి భౌతిక దూరం పాటిస్తూ దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసారు. అలాగే దర్శనానికి వస్తున్న భక్తులపై ఆటోమేటిక్ డిస్ ఇన్ఫెక్షన్ స్ప్రే అయ్యేలా ఏర్పాట్లు చేశారు. అలానే ప్రతిఒక్కరికి శానిటైజర్ ఏర్పాటు చేసి థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. ఇక ఎవరైనా మాస్క్ ధరించకుండా వస్తే నిర్వాహకులు వారిని అనుమతించడం లేదు.