గంగమ్మ ఒడిలో ఒదిగిన ఖైరతాబాద్ గణపయ్య

Advertisement

ఖైరతాబాద్ ధన్వంతరి నారాయణ మహా గణపతి గంగమ్మ ఒడిలో చేరాడు. కరోనా నేపథ్యంలో వేడుకలు నిడంబరంగానే జరిగాయి. ఇక ఎన్టీఆర్ మార్గ్ వ‌ద్ద ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ 4 వ‌ద్ద మ‌హాగ‌ణ‌ప‌తి నిమ‌జ్జ‌నం విజ‌య‌వంతంగా ముగిసింది. మ‌హాగ‌ణ‌ప‌తి నిమ‌జ్జ‌నాన్ని చూసేందుకు భ‌క్తులు అధిక సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. నిమ‌జ్జ‌నం కంటే ముందు గ‌ణేష్ ఉత్స‌వ స‌మితి సిబ్బంది గ‌ణ‌నాథుడికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వహించారు.

ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ ప‌రిస‌రాలు అన్ని కూడా జై గణేశా, బై బై గ‌ణేశా అంటూ నినాదాల‌తో మారుమోగిపోయాయి. ఇక కరోనా కారణంగా ఈ ఏడాది ఉత్సవాలు పెద్దగా జరుపుకొకపోగా, వచ్చే ఏడాది వైభవంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి అని భక్తులు గణేశున్ని దీవెనలు తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here